సీఎం జగన్ తో భేటీ కానున్న నాగార్జున.. చిరంజీవి లేకుండానే మీటింగ్

pratap reddy   | Asianet News
Published : Oct 28, 2021, 02:46 PM ISTUpdated : Oct 28, 2021, 05:09 PM IST
సీఎం జగన్ తో భేటీ కానున్న నాగార్జున.. చిరంజీవి లేకుండానే మీటింగ్

సారాంశం

కరోనా ప్రభావంతో చిత్ర పరిశ్రమ గత ఏడాదిన్నర కాలంగా సమస్యల్లో చిక్కుకుంది. సినిమాల విడుదుల ఆలస్యం అవుతోంది. థియేటర్స్ సమస్య, ఆన్లైన్ టికెట్ ధరలు వ్యవహారం టాలీవుడ్ ని గందరగోళంలోకి నెట్టింది.

కరోనా ప్రభావంతో చిత్ర పరిశ్రమ గత ఏడాదిన్నర కాలంగా సమస్యల్లో చిక్కుకుంది. సినిమాల విడుదుల ఆలస్యం అవుతోంది. థియేటర్స్ సమస్య, ఆన్లైన్ టికెట్ ధరలు వ్యవహారం టాలీవుడ్ ని గందరగోళంలోకి నెట్టింది. నిర్మాతలు వరుసగా మంత్రి పేర్ని నానితో భేటీ అవుతూ వస్తున్నారు. కానీ వ్యవహారాలు ఓ కొలిక్కి రావడం లేదు. ఆ మధ్యన సీఎం జగన్ నుంచి చిరంజీవికి ఆహ్వానం అందింది. 

త్వరలోనే సినీ పెద్దలు Chiranjeevi నేతృత్వంలో జగన్ తో భేటీ కాబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ వీరి భేటీ వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో టాలీవుడ్ సమస్యలపై పవన్ కళ్యాణ్.. జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రసంగించారు. దీనితో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. టాలీవుడ్ సమస్యలపై చర్చ జరిగింది. 

దీనితో Dil Raju, మరికొంత మంది నిర్మాతలు మంత్రి Perni Nani ని కలసి వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా నేడు YS Jagan తో భేటీ అయ్యేందుకు Nagarjuna మరికొంత మంది నిర్మాతలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. కానీ ఈ సమావేశానికి చిరంజీవి హాజరు కావడం లేదు. చిరంజీవి ఎందుకు హాజరు కావడం లేదనే దానిపై కారణాలు తెలియాల్సి ఉంది. 

వీడియో

అయితే నాగార్జున చిత్ర పరిశ్రమ తరుపున జగన్ కి సమస్యలు వివరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో నాగార్జునతో పాటు ప్రీతం రెడ్డి, నిరంజన్ రెడ్డి పాల్గొననున్నారు. అయితే నాగార్జున.. జగన్ తో భేటీ కానుండడం వెనుక వ్యక్తిగత కారణాలు కూడా ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

Also Read: ఘాటు అందాలని వయ్యారంగా ఒలకబోస్తున్న అనసూయ.. హాట్ నెస్ కి ఫిదా కావాల్సిందే

ఇదిలా ఉండగా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జగన్ వ్యక్తిగతంగా తనపై కోపంతోనే చిత్ర పరిశ్రమని ఇబ్బంది పెడుతున్నట్లు ఆరోపించారు. అవసరమైతే తన చిత్రాలు బ్యాన్ చేయాలనీ.. సినీ పరిశ్రమని వదిలేయాలని పవన్ జగన్ కి సూచించారు. ప్రభుత్వం లోన్ల రూపంలో ప్రయోజనాలు పొందేందుకే ఆన్లైన్ టికెట్ విధానం తీసుకువస్తుందని పవన్ విమర్శించిన సంగతి తెలిసిందే.  

PREV
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు