Samantha Naga chaitanya divorce: చైతు జ్ఞాపకాలు చెరిపేస్తున్న సమంత, ఆ ఫోటోలు డిలీట్

Published : Oct 28, 2021, 02:29 PM IST
Samantha Naga chaitanya divorce: చైతు జ్ఞాపకాలు చెరిపేస్తున్న సమంత, ఆ ఫోటోలు డిలీట్

సారాంశం

Samantha చైతు జ్ఞాపకాల నుండి పూర్తిగా బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్ నుండి చైతన్య ఫోటోలు, ఆయనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు తొలగించారు. 

సమంత-నాగ చైతన్య ఎందుకు విడిపోయారనేది మిలియన్ డాలర్ క్వశ్చన్. పలు పుకార్లు చక్కర్లు కొడుతున్నా, అది వారిద్దరికి మాత్రమే తెలిసిన నిజం. విడాకుల ప్రకటనకు ముందు, తర్వాత కూడా మీడియా ఫోకస్ మొత్తం సమంత పైనే ఉంది. Naga chaitanya సైలెంట్ గా ఉంటూ తన పని తాను చేసుకు పోతున్నాడు. సమంత మాత్రం సోషల్ మీడియా వేదికగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏదో చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా మీడియాలో ఆమె హైలెట్ కావడానికి కారణం అవుతుంది.

 
ఏది ఏమైనా Samantha చైతు జ్ఞాపకాల నుండి పూర్తిగా బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్ నుండి చైతన్య ఫోటోలు, ఆయనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు తొలగించారు. దాదాపు చైతన్యకు సంబంధించిన 80 ఫోటోలు  సమంత ఇంస్టాగ్రామ్ నుండి తొలగించినట్లు సమాచారం. అయితే ఇప్పటికీ కొన్ని ఫోటోలు అకౌంట్ లో ఉన్నాయి. త్వరలో ఆ ఫోటోలు కూడా తొలగించి, ఆయనను అన్ ఫాలో అవుతుందని కొందరు భావిస్తున్నారు. 

Also read Samantha: షాక్.. ప్రీతమ్ జకల్కర్ తో సమంత దుబాయ్ టూర్... ఆమె చెప్పాలనుకుంటున్న విషయం అదేనా!
మరోవైపు సమంత వరుసగా విహారాలకు వెళుతున్నారు. ఇటీవల తన ఫ్రెండ్ శిల్పారెడ్డితో కలిసి డెహ్రాడూన్ వెళ్లిన సమంత, అనంతరం వారం రోజులకు పైగా చార్ ధామ్ యాత్ర చేశారు. ప్రస్తుతం సమంత దుబాయ్ వెకేషన్ లో ఉన్నారు. ఈ ట్రిప్ కి తన పర్సనల్ స్టైలిస్ట్, డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ తో సమంత వెళ్లడం విశేషం. సమంత - చైతు బ్రేకప్ కి Preetham jukalker నే ప్రధాన కారణం అని వినిపించగా, సమంత అతనితో ట్రిప్ కి వెళ్లడం సంచలనంగా మారింది. 

Also read వైరల్‌ అవుతున్న సమంత పోస్ట్.. కూతుళ్లని పెళ్లికోసం కాదు తనకోసం బతికేలా పెంచండి అంటూ..
ఇక ఈ ట్రిప్ అనంతరం సమంత తన కొత్త చిత్రాల షూటింగ్స్ లో పాల్గొననున్నారు. ఇప్పటికే రెండు బైలింగ్వెల్ ప్రాజెక్ట్స్ ఓకే చేశారు. అలాగే షారుక్ ఖాన్-అట్లీ చిత్రం నుండి నయనతార తప్పుకున్నారని, ఆ ప్రాజెక్ట్ కూడా సమంత ఖాతాలోకి చేరిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్
నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా