‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ : ఆ యూట్యూబ్ ఛానల్ తో టై అప్ కాబోతున్న రాజమౌళి?

‘‘భారతీయ అతి పెద్ద యాక్షన్‌ డ్రామా చిత్రాన్ని ఆస్వాదించేందుకు సిద్ధం కండి’’ అంటూ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ టీమ్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది టీమ్. రిలీజ్ కు టైమ్ దగ్గర పడటంతో రాజమౌళి ప్రమోషన్స్ కోసం రకరకాల టైఅప్ లు అవుతున్నట్లు వినికిడి. 


 మొత్తానికి  ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ కొత్త విడుదల తేదీ ఖరారైంది. అనేకసార్లు వాయిదా పడిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘భారతీయ అతి పెద్ద యాక్షన్‌ డ్రామా చిత్రాన్ని ఆస్వాదించేందుకు సిద్ధం కండి’’ అంటూ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ టీమ్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది టీమ్. రిలీజ్ కు టైమ్ దగ్గర పడటంతో రాజమౌళి ప్రమోషన్స్ కోసం రకరకాల టైఅప్ లు అవుతున్నట్లు వినికిడి. 

తాజాగా మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అమెరికన్ ప్రముఖ యూట్యూబర్ జిమ్మీ డోనాల్డ్ సన్ తో ఆయన చేతులు కలపబోతున్నారు. జిమ్మీ ..మిస్టర్ బీస్ట్ అనే యూట్యూబ్ ఛానెల్ ని రన్ చేస్తున్నారు. ఈ యూట్యూబ్ కు 72 మిలియన్స్ కు పైగా సబ్ స్కైబర్స్ ఉన్నారు. అందుకే ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ కోసం ఈ యూట్యూబర్ తో మాట్లాడుతున్నారట. సోషల్ మీడియానే ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ కోసం ఎక్కువగా వినియోగించబోతున్నారట. వరల్డ్ వైడ్ భారీగా రిలీజ్ కాబట్టి సోషల్ మీడియా ద్వారా ఎక్కువ బెనిఫిట్ పొందాలని చూస్తున్నారని తెలుస్తోంది.

Latest Videos

ఇక రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించింది. చైనీస్‌, జపనీస్‌ భాషల్లోనూ విడుదలై విజయాన్ని సొంతం చేసుకుంది. అదే తరహాలోనే తన కొత్త చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’నీ ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇంగ్లిష్‌, పోర్చుగీస్‌, కొరియన్‌, టర్కిష్‌, స్పానిష్‌ భాషల్లోనూ చిత్రం విడుదల కానుంది. అందుకే ఈ తరహా ప్రమోషన్స్ కి ప్రయారిటీ ఇస్తున్నారట.

 ఇక ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కుల్ని, శాటిలైట్‌ హక్కుల్ని సొంతం చేసుకున్న పెన్‌ స్టూడియోస్‌, దాదాపు పది భాషల్లో హక్కుల్ని అమ్మింది. ఆ మేరకు ఆయా విదేశీ భాషలకి చెందిన డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్నట్టు పెన్‌ స్టూడియోస్‌ తెలిపింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలకి చెందిన డిజిటల్‌ హక్కుల్నేమో జీ5, హిందీ డిజిటల్‌ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ సొంతం చేసుకుంది. 

శాటిలైట్‌ హక్కుల్నేమో హిందీలో జీ సినిమా, దక్షిణాదిలో డిస్నీ స్టార్‌ సంస్థ చేజిక్కించుకుంది. ఈ ఎగ్రిమెంట్స్ భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యధిక విలువతో కూడుకున్నవని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌  హీరోలుగా నటిస్తున్న చిత్రమిది. అలియాభట్‌, ఒలివియా మోర్రిస్‌ హీరోయిన్స్. అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. 1920 నేపథ్యంలో సాగే చిత్రమిది.
  
 

click me!