త్రివిక్రమ్ సినిమాలో పవన్ అత్తగా ఖుష్బూ

Published : Nov 03, 2016, 11:49 AM ISTUpdated : Mar 24, 2018, 12:04 PM IST
త్రివిక్రమ్ సినిమాలో పవన్ అత్తగా ఖుష్బూ

సారాంశం

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర పవన్ అత్త రోల్ కోసం ఖుష్బూను ఎంచుకున్న త్రివిక్రమ్ నవంబర్ 5న పవన్-త్రివిక్రమ్ మూవీ ప్రారంభం

ఈ నెల 5వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లోని కొత్త సినిమా మొదలవుతోంది. ఇప్పటికే కథానాయికగా సమంతాను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీకి సంబంధించిన ఒక వార్త మాత్రం ఫిల్మ్ నగర్లో జోరుగా చర్చనీయాంశమైంది. ఒక కీలకమైన పాత్ర కోసం ఖుష్బూను తీసుకున్నారని అంతా అననుకుంటున్నారు.

గతంలో ' అత్తారింటికి దారేది' సినిమా కోసం పవన్ అత్తగా త్రివిక్రమ్ 'నదియా'ను తీసుకున్నాడు. ఆ పాత్ర ఆమెకి ఎంతో క్రేజ్ తో పాటు అవకాశాలను కూడా తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే తరహా పాత్ర కోసం ఖుష్బూ ను ఎంపిక చేశారని అంటున్నారు. అదే నిజమైతే పవన్ అత్త పాత్రలో ఖుష్బూ ఎన్ని మార్కులు కొట్టేస్తుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Peddi Movie: పెద్దిగాడు మొదలు పెట్టాడు, బాబాయ్ కే ఝలక్ ఇచ్చిన రాంచరణ్.. ఓజీ రికార్డు బద్దలు
Comedian Satya: ఆ సినిమా దర్శకుడి పేరును తన కూతురికి పెట్టుకున్న కమెడియన్ సత్య