నాని ప్లే బాయ్ అన్నారు.. మరి వాళ్లేంటి..? కౌశల్ కామెంట్స్!

By Udayavani DhuliFirst Published Oct 9, 2018, 10:50 AM IST
Highlights

బిగ్ బాస్ హౌస్ లో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని విజేతగా నిలిచారు కౌశల్. హౌస్ లో అందరూ ఒక్కటై అతడిని సెపరేట్ గా చూసినా కౌశల్ మాత్రం పట్టుదలతో విజయం సాధించాడు. ఆయన్ని విజేతగా ప్రకటించినప్పుడు కూడా హౌస్ మేట్స్ ముఖాల్లో సంతోషం కనిపించలేదు. 

బిగ్ బాస్ హౌస్ లో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని విజేతగా నిలిచారు కౌశల్. హౌస్ లో అందరూ ఒక్కటై అతడిని సెపరేట్ గా చూసినా కౌశల్ మాత్రం పట్టుదలతో విజయం సాధించాడు. ఆయన్ని విజేతగా ప్రకటించినప్పుడు కూడా హౌస్ మేట్స్ ముఖాల్లో సంతోషం కనిపించలేదు.

ఇది ఇలా ఉండగా.. హౌస్ లో కౌశల్.. సంజన చేయి పట్టుకోవడం, సునైనాను ఎత్తుకోవడం వంటి విషయాలపై స్పందించారు. మొదటి వారంలోనే సంజనని జైలులో పెట్టారు. ఆ సమయంలో కౌశల్ దగ్గర జైలు కార్డు ఉన్నా.. అది తనకి ఉపయోగించాలని కౌశల్ అనుకోలేదు.

దీంతో ఆమెను జైలునుండి విదిపించలేదనే భావనతో ఆ అమ్మాయి చేయి పట్టుకున్నట్లు చెప్పారు కౌశల్. అయితే హోస్ట్ గా చేసిన నాని.. 'ప్లే బాయ్ కౌశల్' అని అనడంతో అప్పటి నుండి ఎవరిని టచ్ కాదు కదా.. దగ్గరకి కూడా వెళ్లలేదని అన్నారు.

చేయి పట్టుకున్న నన్నే ప్లే బాయ్ అంటే మిగిలిన వాళ్లు హగ్గులు, కిస్సులు, ఒకరిపై మరొకరు కూర్చోవడం వంటివి చూస్తే మరి వాళ్లని ఏం అనాలో అర్ధం కాలేదని కౌశల్ అభిప్రాయ పడ్డారు. టాస్క్ లో భాగంగా సునైనాని ఎత్తుకోవాల్సి వస్తే అది ఆమెకి నచ్చకపోవడంతో 'నువ్వు నా చెల్లి లాంటిదానివని' చెప్పానని కౌశల్ అన్నారు. సునైనా తనకంటే 14 ఏళ్లు చిన్నదని ఆమె చెల్లెలితో సమానమని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి.. 

ఏం చేశాడని కౌశల్ కి డాక్టరేట్..?

అలాంటి పాత్రల్లో నటించాలనుంది.. కౌశల్ వ్యాఖ్యలు!

తేజస్వి చాలా సార్లు బూతులు తిట్టింది.. కౌశల్ ఆవేదన!

హౌస్ మేట్స్ పై కౌశల్ సంచనల కామెంట్స్!

కౌశల్ గెలిచినా.. గీతాదే పైచేయి!

బోయపాటి సినిమాపై బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కామెంట్స్!

కౌశల్ కి అరుదైన గౌరవం.. ఆయన మాటల్లోనే!

కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్.. హీరోయిన్ కి అవమానం!

click me!