హీరో రోల్స్ కోసం చూస్తున్నా: బిగ్ బాస్ విన్నర్ కౌశల్!

By Udayavani DhuliFirst Published Oct 17, 2018, 9:32 AM IST
Highlights

మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన కౌశల్ ఇప్పుడు బుల్లితెరకే పరిమితమయ్యారు. బిగ్ బాస్ షో విజేతగా నిలిచి తనకంటూ ఫ్యాన్స్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు.

మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన కౌశల్ ఇప్పుడు బుల్లితెరకే పరిమితమయ్యారు. బిగ్ బాస్ షో విజేతగా నిలిచి తనకంటూ ఫ్యాన్స్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు.

అతడు హౌస్ లో ఉండగా అతడి కోసం ఏర్పాటైన కౌశల్ ఆర్మీ ర్యాలీలు నిర్వహించడం, సేవా కార్యక్రమాలు వంటి పనులు చేశారు. టైటిల్ గెలిచిన తరువాత కౌశల్ వచ్చిన ప్రైజ్ మనీని క్యాన్సర్ పేషెంట్స్ కోసం వినియోగిస్తున్నట్లు ప్రకటించారు.

ఇప్పుడు తనకున్న ఫ్యాన్స్ బేస్ తో నటుడిగా రాణించాలని భావిస్తున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడుతూ... ''మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమా తరువాత సినిమాలు చేయడం మానేశాను.

కానీ ఇప్పుడు సినిమాలో లీడ్ రోల్స్ కోసం చూస్తున్నా.. ఆ విధంగా నా టాలెంట్ నిరూపించుకునే అవకాశం వస్తుందని అనుకుంటున్నాను. విలన్ రోల్స్ లో కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నాను'' అంటూ చెప్పుకొచ్చాడు. 

ఇవి కూడా చదవండి.. 

కౌశల్ చెప్పేవన్నీ అబద్ధాలే.. గీతామాధురి కామెంట్స్!

తేజస్వి అలా చేయడం చూపించలేదు.. కౌశల్ కామెంట్స్!

నాకు ప్రధానమంత్రి ఆఫీస్ నుండి కాల్ వచ్చింది.. కౌశల్!

ఏం చేశాడని కౌశల్ కి డాక్టరేట్..?

అలాంటి పాత్రల్లో నటించాలనుంది.. కౌశల్ వ్యాఖ్యలు!

తేజస్వి చాలా సార్లు బూతులు తిట్టింది.. కౌశల్ ఆవేదన!

హౌస్ మేట్స్ పై కౌశల్ సంచనల కామెంట్స్!

కౌశల్ గెలిచినా.. గీతాదే పైచేయి!

click me!