బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కౌశల్ కారు వద్ద అభిమానుల నినాదాలు!

Published : Sep 30, 2018, 09:04 PM ISTUpdated : Sep 30, 2018, 09:08 PM IST
బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కౌశల్ కారు వద్ద అభిమానుల నినాదాలు!

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ కౌశల్ కి ఎంతటి ప్రేక్షకాదరణ దక్కిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడే విజేత కావాలని రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాదు.. విదేశాల నుండి కూడా భారీ సంఖ్యలో ఓట్లు వేశారు.

బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ కౌశల్ కి ఎంతటి ప్రేక్షకాదరణ దక్కిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడే విజేత కావాలని రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాదు.. విదేశాల 
నుండి కూడా భారీ సంఖ్యలో ఓట్లు వేశారు.

వారు ఆశించిన విధంగానే కౌశల్ విజేతగా నిలిచారు. అయితే ఆదివారం ఫినాలే ఎపిసోడ్ కి కౌశల్ అభిమానులు దాదాపు 300 మండి అన్నపూర్ణ స్టూడియోకి చేరుకున్నారు. కౌశల్, కౌశల్ అంటూ వారు చేసిన నినాదాల వల్ల షోకి కూడా కొద్దిసేపు ఆటంకం జరిగినట్లు తెలుస్తోంది.

అయితే కౌశల్ ని విజేతగా ప్రకటించిన తరువాత మొత్తం షో పూర్తయి అన్నపూర్ణ స్టూడియో నుండి బయటకి వెళ్తోన్న కౌశల్ కారు చుట్టూ గుమ్మిగూడిన అభిమానులు కౌశల్, కౌశల్ అంటూ నినాదాలు చేశారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

PREV
click me!

Recommended Stories

JVAS Movie Review: 15 రోజులు బెడ్ పైనే చిరంజీవి, ప్రాణాలకు తెగించి మెగాస్టార్ చేసిన సాహసం, జగదేకవీరుడు అతిలోకసుందరి రివ్యూ
Vishwanath and Sons day1 Collection: సూర్యకు తమిళ ప్రేక్షకుల షాక్, తెలుగులో దుమ్మురేపుతోన్న విశ్వనాథ్ అండ్ నన్స్, ఫస్ట్ డే వసూళ్లు ఎంత?