బిగ్ బాస్ చరిత్రలోనే చికాకు తెప్పించే వ్యక్తి కౌశల్.. కత్తి మహేష్ కామెంట్స్!

Published : Sep 24, 2018, 12:12 PM IST
బిగ్ బాస్ చరిత్రలోనే చికాకు తెప్పించే వ్యక్తి కౌశల్.. కత్తి మహేష్ కామెంట్స్!

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 2 లో ఫినాలేకి చేరుకున్న కౌశల్ పై కత్తి మహేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల హౌస్ లో చోటుచేసుకున్న సంఘటనలను ఆధారం చేసుకొని.. 'కౌశల్ అంతా కోల్పోయాడు.. అతడిని హౌస్ నుండి బయటకి గెంటేయండి' అని పోస్ట్ పెట్టారు కత్తి మహేష్.

శనివారం ఎపిసోడ్ లో నాని కౌశల్ ని ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. 'చాలా పేలవమైన, విసుగుపుట్టించే సమాధానం కౌశల్ చెప్పాడు. బిగ్ బాస్ చరిత్రలోనే అతడు చికాకు తెప్పించే వ్యక్తి' అని చెబుతూ.. తాజాగా మరొక పోస్ట్ పెట్టారు. 'కౌశల్ బిగ్ బాస్ 2 లోనే చాల విసుగు తెప్పించే వ్యక్తి. ఒకవేళ అతను బిగ్ బాస్ 2 టైటిల్ గెలిస్తే మనమెంత ఇడియట్స్ అనే విషయం ప్రూవ్ అవుతుంది' అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

ఇక తాను హౌస్ లో కంటెస్టెంట్ దీప్తి నల్లమోతు కోసం కాంపెయిన్ నిర్వహిస్తానని తెలిపారు. కౌశల్ ని టార్గెట్ చేస్తూ కత్తి మహేష్ చేసిన కామెంట్స్ పై స్పందించిన ఓ మహిళ.. ''ప్రజలు ఎవరినైతే ఇష్టపడతారో వాళ్లనే మీరెందుకు టార్గెట్ చేస్తారని'' ప్రశ్నించింది. దీనికి సమాధానంగా 'ప్రజల ఒపీనియన్ తో తనకు సంబంధం లేదని.. తన దారిలో తాను వెళ్తానని' స్పష్టం చేశాడు కత్తి మహేష్.  

ఇవి కూడా చదవండి..

బిగ్ బాస్2: రోల్ ఔట్.. టాప్ త్రీలో ఆ ముగ్గురే!

టైటిల్ నాదే.. కౌశల్ కాన్ఫిడెన్స్!

PREV
click me!

Recommended Stories

BMW First Review: `భర్త మహాశయులకు విజ్ఞప్తి` మూవీ ఫస్ట్ రివ్యూ.. రవితేజ కాలర్‌ ఎగరేసే టైమ్‌ వచ్చిందా?
Sudigali Sudheer Rashmi Gautam లవ్‌ స్టోరీ తెగతెంపులు.. అందరి ముందు ఓపెన్‌గా ప్రకటించిన జబర్దస్త్ కమెడియన్‌