హీరో విజయ్ ఇద్దరు భార్యల సిగపట్టు!

By Udayavani DhuliFirst Published Sep 24, 2018, 11:54 AM IST
Highlights

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారాడు కన్నడ నటుడు దునియా విజయ్. తరచూ ఏదొక వివాదంలో ఇరుక్కుంటూ..  అరెస్ట్ అవుతున్నాడు. ప్రస్తుతం ఓ కేసులో బెయిల్ పై ఉన్న అతడిపై ఏకంగా కిడ్నప్ కేసు నమోదు కావడంతో పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు.

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారాడు కన్నడ నటుడు దునియా విజయ్. తరచూ ఏదొక వివాదంలో ఇరుక్కుంటూ..  అరెస్ట్ అవుతున్నాడు. ప్రస్తుతం ఓ కేసులో బెయిల్ పై ఉన్న అతడిపై ఏకంగా కిడ్నప్ కేసు నమోదు కావడంతో పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. జిమ్ ట్రైనర్ మారుతీ గౌడకి విజయ్ కి మధ్య జరిగిన గొడవలో విజయ్ తన అనుచరులతో బాధితుడిని కొట్టించాడు.

మారుతిగౌడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విజయ్ తో సహా ఏడుగురిపై కేసులు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా.. మరో పక్క విజయ్ ఇద్దరు  భార్యలు తమ గొడవలతో రోడ్డెక్కారు. ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. దునియా విజయ్ మొదటి భార్య నాగరత్నకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం దునియా విజయ్ తన చిన్న భార్య కీర్తి గౌడతో కలిసి ఉంటున్నారు.

దునియా విజయ్.. మారుతిగౌడతో గొడవ పడే సమయంలో నాగరత్న కొడుకు కూడా తండ్రితో పాటే ఉన్నాడు. కొడుకు ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో ఆగ్రహానికి లోనైన నాగరత్న నేరుగా కీర్తిగౌడ ఇంటికి వెళ్లి గొడవ చేశారు. ఈ సమయంలో కీర్తి గౌడ వెంట ఉండే బౌన్సర్ లు నాగరత్నతో అనుచితంగా ప్రవర్తించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె వెంటనే గిరినగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది.

ఆ తరువాత కీర్తిగౌడ కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి నాగరత్నపై ఫిర్యాదు చేసింది. ఓ పక్క కేసుల మీద కేసులతో దునియా విజయ్ కోర్టుల చుట్టూ తిరుగుతుంటే మరోపక్క అతడి ఇద్దరు భార్యలు రోడ్డుకెక్కి నానాగొడవ చేస్తున్నారు. 

click me!
Last Updated Sep 24, 2018, 11:54 AM IST
click me!