బ్రహ్మితో తేజస్వి.. ఈ సారి మరో దారి!

Published : Sep 24, 2018, 11:51 AM IST
బ్రహ్మితో తేజస్వి.. ఈ సారి మరో దారి!

సారాంశం

  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు తెరకు పరిచయమై అతి తక్కువ కాలంలోనే హాట్ బేబీ గా గుర్తింపు తెచ్చుకున్న నటి తేజస్వి మాదివాడ. అమ్మడు చేసిన సినిమాలు పెద్దగా విజయం సాధించకపోయినప్పటికీ పాత్రలతో కొంత వరకు గుర్తింపు బాగానే తెచ్చుకుంది. 

 

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు తెరకు పరిచయమై అతి తక్కువ కాలంలోనే హాట్ బేబీ గా గుర్తింపు తెచ్చుకున్న నటి తేజస్వి మాదివాడ. అమ్మడు చేసిన సినిమాలు పెద్దగా విజయం సాధించకపోయినప్పటికీ పాత్రలతో కొంత వరకు గుర్తింపు బాగానే తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా సందడి చేసినట్లే చేసి ఊహించని విధంగా కొన్ని రోజులకే ఎలిమినెట్ అయ్యింది. ఇక అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. 

 

అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ ఐస్ క్రీమ్ బ్యూటీ కొత్త తరహా దారిని ఎంచుకుంది. యాంకర్ అనే పదానికి కొత్త అర్ధాన్ని తెచ్చిన అనసూయ - రష్మీ వంటి వారి తరహాలో గుర్తింపు తెచ్చుకోవడానికి [ప్రయత్నం చేస్తోంది. త్వరలో స్టార్ మాలో స్టార్ట్ కానున్న ది గ్రేట్ తెలుగు లాఫ్టర్ ఛాలెంజ్ షోలో తేజస్వి యాంకరింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.  కామెడీ కింగ్ బ్రహ్మానందం  ఈ షోకి హోస్ట్ గా బాధ్యతలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. 

 

హీరోయిన్ గా  పెద్దగా  సక్సెస్ అందుకోలేని తేజస్వి బిగ్ బాస్ ద్వారా కూడా ఎలాంటి లాభం పొందలేకపోయింది. షోలో జరిగిన గొడవలకు అమ్మడిపై నెగిటివ్ కామెంట్స్ ఏ రేంజ్ లో వచ్చాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు లక్కీగా దొరికిన యాంకరింగ్ అవకాశాన్ని అమ్మడు ఎంతవరకు యూజ్ చేసుకుంటుందో చూడాలి.      

PREV
click me!

Recommended Stories

Janhvi Kapoor: త్వరలో ప్రియుడితో జాన్వీ కపూర్ పెళ్లి.. కెరీర్ పీక్ లో ఉండగా ఇలా, తండ్రి ఏమంటున్నాడో తెలుసా
Thalapathy Vijay: బాక్సాఫీస్ నుంచి బ్యాలెట్ బాక్స్ వరకు.. దళపతి విజయ్ మాస్ జర్నీ ఎలా సాగిందో తెలుసా?