ఆ హీరోలతో తనకు శారీరక సంబంధం ఉందన్న కంగనా

Published : Oct 03, 2017, 03:40 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
ఆ హీరోలతో తనకు శారీరక సంబంధం ఉందన్న కంగనా

సారాంశం

మరోసారి వార్తల్లోకి ఎక్కిన కంగనా హీరోలతో తనకు శారీరక సంబంధం ఉందన్న కంగనా హృతిక్ మాటలకు మోసపోయానన్న కంగనా

బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలో నిలుస్తుంటారు.  నిన్న మొన్నటిదాకా.. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తో ప్రేమాయణం, తర్వాత బ్రేకప్ గొడవలతో వార్తలకెక్కిన కంగనా.. తాజాగా.. మరిన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ప్రముఖ హిందీ న్యూస్ చానెల్ షోలో మాట్లాడుతూ.. పరిశ్రమలో తాను ఎవరికి భయపడనని.. తన మనసుకు నచ్చింది మాట్లాడుతాను అని చెప్పకొచ్చింది. అంతేకాకుండా పలువురు హీరోలతో తనకు ఉన్న శారీరక సంబంధాలను బయటపెట్టి సంచలనం రేపింది.

 

హీరోలతో సన్నిహితంగా నటించేటప్పుడు.. ప్రేమలో పడటం సహజమని చెప్పింది. ఒక్కోసారి తోటి హీరోలతో పడక కూడా పంచుకోవాల్సి వస్తుందని.. అలా చేయకపోతే.. వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని కంగనా చెప్పింది. ఇలాంటి పరిస్థితి తనతోపాటు చాలా మంది హీరోయిన్లు ఎదుర్కొన్నారని కంగనా తెలిపింది.

 

హృతిక్ తన వైవాహిక జీవితం సరిగాలేదని.. తాను తన భార్య వేరువేరు గదుల్లో పడుకుంటున్నామంటూ... తనతో చెప్పి కన్నీరు పెట్టుకున్నాడని తెలిపింది. ఆ మాటలకు తాను కరిగిపోయి హృతిక్ మాయలో పడిపోయానని చెప్పింది. తాను యవ్వనంలో ఉండటంతో వెంటనే హృతిక్ ప్రేమలో పడిపోయానని కంగనా వెల్లడించింది.

 

ఇక ఆదిత్య పంచోలి గురించి షాకింగ్ విషయాలను వెల్లడించింది. తనకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడే  ఆదిత్య పంచోలి తనను లైంగికంగా వేధించాడని, తనను శారీరికంగా వాడుకొన్నాడని తెలిపింది. ఆ సమయంలో తనకు ఆర్థిక సమస్యలు ఉండటంతో ఆయనకు లొంగిపోవాల్సి వచ్చిందని చెప్పింది.

PREV
click me!

Recommended Stories

భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?
Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం