Brahmamudi: ఆ బాధ్యత తీసుకోలేనంటున్న రాజ్.. కావ్య ఇంట్లో కనకానికి ఘోర అవమానం!

Published : Mar 16, 2023, 12:55 PM IST
Brahmamudi: ఆ బాధ్యత తీసుకోలేనంటున్న రాజ్.. కావ్య ఇంట్లో కనకానికి ఘోర అవమానం!

సారాంశం

Brahmamudi: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల  హృదయాలని దోచుకుంటుంది. టీఆర్పి లో టాప్ సీరియల్స్ కి గట్టి పోటీ ఇస్తుంది ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చి 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

ఎపిసోడ్ ప్రారంభంలో ఇంటి ముందు అందమైన రంగవల్లులు వేస్తుంది కావ్య. అప్పుడే వచ్చిన చిట్టి అవన్నీ చూసి అపర్ణ వేసిందేమో అనుకుంటుంది. ఇవన్నీ ఇంటికి వచ్చిన కొత్త కోడలు వేశారండి అని చెప్తుంది శాంత. అప్పుడే జాగింగ్ నుంచి వచ్చిన రాజ్ ఆ మాటలు వింటాడు. ఇంటి ముందు అందంగా ముగ్గులు వేసిన ఇల్లాలు ఇంటిని కూడా అందంగానే తీర్చిదిద్దుతుంది.

కొత్త కోడలు పద్ధతి గల అమ్మాయే.. ఉండు అపర్ణని కూడా పిలుచుకు వస్తాను చూసి సంతోషిస్తుంది  అంటుంది చిట్టి. నువ్వు మురిసిపోయింది చాలక అమ్మకు కూడా చూపిస్తానంటావ్ ఏంటి ఈ కళావతి ముగ్గుతో అందర్నీ ముగ్గులోకి లాగేస్తున్నట్లుగా ఉంది. ఇప్పుడు అమ్మ ఈ ముగ్గు చూసిందంటే ఇంప్రెస్  అవుతుంది. అలా జరగకూడదు అనుకుంటూ ముగ్గులన్ని కాలితో చెరిపేస్తాడు.

అది కావ్య చూస్తుంది. ముందు కంగారుపడినా తర్వాత ఏం చేస్తావో చేసుకో అన్నట్లుగా అక్కడినుంచి వెళ్ళిపోతాడు రాజ్. ఈ లోపు బయటకు వచ్చిన శాంత అంత అందమైన ముగ్గుల్ని చెరిపేశారు కుళ్ళుబోతోళ్లు అనుకుంటూ వాళ్ళని తిట్టుకుంటూ లోపలికి వస్తుంది. మరోవైపు ముగ్గు గురించి ధాన్యలక్ష్మికి కూడా చెప్తుంది చిట్టి. నేను చూశాను అత్తయ్య చాలా బాగుంది అంటూ కావ్యని పొగుడుతుంది ధాన్యలక్ష్మి.

ఆ మాటలు విన్న రాజ్ చిరాకు పడుతూ ఉంటాడు. అంతలోనే అక్కడికి వచ్చిన శాంత ఆ ముగ్గుని ఎవరో చెరిపేశారు అంటుంది. నా ముగ్గుని ఎవరు చెరిపేశారు అంటూ ఏమీ తెలియనట్లుగా అక్కడికి వస్తుంది కావ్య. ఎవరో కళ్ళు నెత్తికెక్కినోళ్లు చెరిపేసి ఉంటారు, బర్రె కాళ్ళు వేసుకుని దున్నపోతు తొక్కినట్టు తొక్కుంటారు అంటుంది శాంత. ఇంక భరించలేక ఏంటా భాష అంటూ శాంతని  మందలిస్తాడు రాజ్.

మీ కాళ్ళకి ఏంటా రంగులు అంటూ రాజ్ ని ఇరికించేస్తుంది కావ్య. పాడైపోయిన ముగ్గుల్ని తొక్కుంటాను అంటాడు రాజ్. సరే సరే అంటూ చిట్టి వాళ్ళిద్దర్నీ త్వరగా రెడీ అయ్యి రమ్మంటుంది. మంచి మనసున్న అమ్మాయికి దేవుడు అన్యాయం చేయడు అంటుంది చిట్టి. మరోవైపు దేవుడికి దండం పెట్టుకుంటూ కోడలుగా అంగీకరించని అత్తగారు ఇంట్లో ఉంటున్నాను.

ఎన్ని సమస్యలు ఎదురైనా వెనకడుగు వేయని మనో బలాన్ని ఇవ్వు అంటూ కోరుకుంటుంది. అంతలోనే అక్కడికి వచ్చిన కళ్యాణ్ గది గర్భగుడి అయింది, పాత వాసన పోయి అగరవత్తుల వాసన గుబాలిస్తుంది అంటూ మెచ్చుకుంటాడు కళ్యాణ్. పొద్దున్నే కళా పిపాసి గారు ఇలా దయ చేశారు ఏంటి అంటుంది కావ్య. ఒక్క పూటలో ఏమీ జరగనట్టు ఇలా మారిపోయారు ఏంటి అంటాడు కళ్యాణ్.

దిగులుగా ఉంటే నా మొహం బాగోదు అందుకే అంటుంది కావ్య. నానమ్మ మిమ్మల్ని పూజగది దగ్గరికి రమ్మంటున్నారు కళ్యాణ్ ఎందుకు అంటుంది కావ్య. పెళ్లి అయినా మరుసటి రోజు నుంచి భార్య బాధ్యతలని భర్త తీసుకుంటాడు అంటాడు కళ్యాణ్. ఈ బరువుని మీ అన్నయ్య ఎత్తుకుంటారా అంటుంది  కావ్య. అన్నింటికి మా నానమ్మ ఉంది కంగారు పడకండి అంటూ కావ్యని తీసుకువెళ్తాడు కళ్యాణ్.

ఎవరు అవునన్నా కాదన్నా నువ్వు మీ ఇంటికి కోడలివి, పరాయి దాని లాగా ఉండకూడదు అంటుంది చిట్టి. అంతలోనే అపర్ణ వచ్చి ఎందుకు రమ్మన్నారు అత్తయ్య అంటుంది. ఈరోజు కొత్త కోడలు తన బాధ్యతని స్వీకరించాలి, మర్చిపోయావా అంటుంది చిట్టి. మర్చిపోవాలి అనుకున్నాను. కోడలుగా బాధ్యతలు స్వీకరించే ముందు భర్త భార్యని స్వీకరించాలి కదా అంటుంది అపర్ణ.

బ్రహ్మముడి పడిన వెంటనే భార్య బాధ్యతలు భర్తవి అని నీకు తెలియదా అంటుంది చిట్టి. మీకు తెలిసినంతగా నాకు తెలియదు మీకు ఏది తోస్తే అది చేయండి కానీ రాజకీయ ఒక మాట చెప్పు చేయండి అంటుంది అపర్ణ. అప్పుడే అక్కడికి వచ్చిన రాజ్ కి విషయం చెప్తుంది చిట్టి. నేను తనని భారీగానే స్వీకరించలేదు అలాంటిది బాధ్యత ఎలా తీసుకుంటాను అంటాడు రాజ్.

అలా అంటావేంటి నువ్వు ఆమె మెడలో తాళి కట్ట లేదా తలంబ్రాలు పోయలేదా, అగ్ని సాక్షిగా ప్రమాణం చేయలేదా అంటుంది చిట్టి. అవన్నీ మనసుతో చేయలేదు అంటాడు రాజ్. మనసు ఎవరికీ కనిపించదు మాంగల్యం మాత్రమే కనిపిస్తుంది అంటుంది చిట్టి. ఆమెను చూసిన ప్రతిసారి మోసానికి ప్రతిబింబం లాగా కనిపిస్తుంది.

ఇప్పుడు సాంప్రదాయాన్ని అనుసరించి ఆమెకి బాధ్యతలని ఇస్తే ఆమెతోపాటు ఆమె చేసిన మోసాన్ని కూడా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది అంటాడు  రాజ్. నీ అభిప్రాయాలతో ఆచారాలని మంట కలుపుతుంటే పెద్దవాళ్లు చూస్తూ ఊరుకోరు. నువ్వు కట్టిన మంగళసూత్రం ఆమెని ఈ ఇంటి సభ్యురాల్ని చేసింది అంటుంది చిట్టి.

మీ మాటని నేను ఎప్పుడూ కాదనలేదు ఇప్పుడు కూడా కాదనను అంటాడు రాజ్. సంతోషం నాన్న అంటూ పూజ గది దగ్గరికి తీసుకు వెళుతుంది చిట్టి. ఈ ఫలము, నగలు ఆమె చేతిలో పెట్టి భార్యగా బాధ్యత తీసుకో అంటుంది చిట్టి. ఈ ఇంట్లో చాలామంది పని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ బాధ్యత నాదే. అలాగే అనుకొని బాధ్యత తీసుకుంటాను అంటూ వాటిని కావ్యకి ఇవ్వబోతాడు రాజ్.

నాకొద్దు అంటుంది కావ్య. ఎంతసేపు నా మనవడికి బుద్ధి చెప్పాను ఇప్పుడు నీకు చెప్పాలా అంటుంది చిట్టి. భర్త ఇస్తుంటే భార్య తీసుకోవాలి అంటుంది ధాన్యలక్ష్మి. ఇదే మాట ఆయన్ని చెప్పమనండి అంటుంది కావ్య. చచ్చినా చెప్పను అంటాడు రాజ్. అయితే చచ్చినా నేను తీసుకోను ఉంటుంది కావ్య. ఇద్దరు పంతాలకు పోవద్దు అంటుంది చిట్టి. భార్యగా బాధ్యత తీసుకోవటానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు కానీ పని మనిషిలా నేను తీసుకోలేను.

నాకు ఆత్మ అభిమానం ఉంటుంది ఇలా నన్ను కించపరుస్తూ ఇచ్చే బాధ్యతని నేను స్వీకరించలేను అంటుంది కావ్య. చూశారా ఎంత పొగరో, వచ్చిన ఒక్క రోజులోనే కోడలిరికం వెలగబెడుతుంది అస్తిత్వము, వ్యక్తిత్వం అంటూ అభ్యుదయ పదాలు వెల్లివేస్తుంది. పెద్దవారు మీరు చెబుతున్నా కూడా సమాధానం చెబుతుంది. భర్త లేదు భార్య లేదు పళ్లెం అక్కడ  పెట్టేసి ఆఫీస్ కి వెళ్ళు అని కొడుక్కి చెప్తుంది అపర్ణ.

నేను పొగరుతో చెప్పిన సమాధానం కాదు ఆయన నన్ను తక్కువ చేసి మాట్లాడుతుంటే భరించలేకపోయాను. మీ మాటకి ఎదురు చెప్పినట్లు అనిపిస్తే నన్ను క్షమించండి అమ్మమ్మ గారు  కావ్య. పంతాలు పట్టింపులు ఎందుకమ్మా తీసుకో అంటుంది ధాన్యలక్ష్మి. ఆయన మనస్ఫూర్తిగా నా బాధ్యతలు ఎప్పుడూ స్వీకరిస్తారో అప్పుడే నేను తీసుకుంటాను అంటుంది కావ్య.

అది ఈ జన్మలోనే కాదు ఎన్ని జన్మలెత్తిన జరగదు అంటూ పళ్ళాన్ని  ఎత్తేస్తాడు రాజ్. కింద పడిపోకుండా పట్టుకుంటుంది కావ్య. మరోవైపు బట్టలు సర్దుకుంటున్న భార్యని ఇదంతా ఏంటి అని అడుగుతాడు కృష్ణమూర్తి. అమ్మ కాయకి దగ్గరికి వెళ్తుందట అని చెప్తుంది  అప్పు. వాళ్ళు తిట్టినా తిట్లు నీ బ్యాగ్ నిండా నింపుకొని వస్తుందంట అని వెటకారంగా మాట్లాడుతుంది. తిడితే తిడతారు పడితే పడతాను అంటుంది కనకం.

అక్కడికి వెళ్లి మాటలు పడటం అవసరమా అంటాడు కృష్ణమూర్తి. వాళ్లు దుగ్గిరాల వాళ్ళు ఇంటికి వచ్చిన మనిషిని ఏమీ అనరు అంటుంది కనకం. నువ్వు చేసింది అప్పుడే మర్చిపోరు, అవమానిస్తారు అంటాడు కృష్ణమూర్తి. అవసరమైతే వాళ్ళ కాళ్లు పట్టుకుంటాను అంటుంది కనకం. నీ బుర్ర ఖరాబ్ అయిందా, వాళ్ళందరూ ఒకలు ఇద్దర కాదు గొర్రెల మందు లాగా 20 మంది ఉన్నారు అంతా కలిసి ఒకటైతే నువ్వేం చేస్తావు అంటూ తల్లికి నచ్చ చెప్తుంది అప్పు.

కన్న పేగు దానిని ఉండనివ్వటం లేదు రాత్రంతా పడుకోలేదు అని చెప్తుంది కనకం తోటి కోడలు. నీ బాధ నాకు అర్థం అవుతుంది కానీ వేళ్ళకు ముందు కొంచెం బాధ వెళ్లి వచ్చిన తర్వాత కోలుకోలేనంత బాధ పడతావేమో అని నా బాధ వెళ్లొద్దు అంటాడు  కృష్ణమూర్తి. పిల్లని కట్టుబట్టలతో పంపించాను నా బాధ నన్ను ఉండనివ్వడం లేదు అంటుంది కనకం. చెప్పులు కూడా లేకుండా కాళ్ల పారాణి తో అలాగే అత్తారింటికి వెళ్లిపోయింది.

 ఆ పోయిందాని షోకుల  కోసం బిడ్డ కడుపు కట్టుకొని డబ్బులు సంపాదించి ఇచ్చింది ఒక్కసారి వెళ్లి చూసి వస్తాను. తను బాగుంటే ఇంక జీవితంలో వాళ్ళ ఇంటికి వెళ్ళను అంటుంది కనకం. తరువాయి భాగంలో కావ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది కనకం. పూజ దగ్గర ఉన్న కావ్య పరిగెత్తుకుంటూ వెళ్లి తల్లిని హత్తుకోబోతుంది. మీరు ఎవరు,ఎందుకు వచ్చారు అంటూ కసురుకుంటాడు రాజ్. కూతుర్ని చూసుకుందామని వచ్చాను అంటుంది కనకం. నిన్నటి నుంచే మీకు, మీ కూతురికి సంబంధాలు తెగిపోయాయి అంటాడు రాజ్.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?