ఆస్కార్‌ని కొన్నారు.. `ఆర్‌ఆర్‌ఆర్‌`కి అవార్డు రావడంపై అజాక్వెలిన్‌ మేకప్‌ ఆర్టిస్టు అక్కసు

Published : Mar 16, 2023, 12:53 PM IST
 ఆస్కార్‌ని కొన్నారు.. `ఆర్‌ఆర్‌ఆర్‌`కి అవార్డు రావడంపై అజాక్వెలిన్‌ మేకప్‌ ఆర్టిస్టు అక్కసు

సారాంశం

`ఆర్‌ఆర్‌ఆర్‌`కి ఆస్కార్‌ అవార్డు రావడం పట్ల దేశం గర్విస్తుంది. ఇండియా మొత్తం సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఈ నేపథ్యంలో జాక్వెలిన్‌ మేకప్‌ ఆర్టిస్టు మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు.

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాకి ఆస్కార్‌ రావడంతో ఇండియా మొత్తం గర్వపడుతుంది. ఫస్ట్ టైమ్‌ ఇండియన్‌ సినిమాకి ఆస్కార్‌ రావడంతో అంతా ఆనందంలో మునిగితేలుతున్నారు. పార్లమెంట్‌లో కూడా దీనిపై ప్రత్యేక చర్చ జరిగింది. అభినందనలు తెలిపారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమకి ప్రశంసలు దక్కుతున్నాయి. ఓ రకంగా ఇండియాసంబరాలు చేసుకుంటుంది. ఇది ఇండియా విజయంగా భావిస్తున్నారు. 

కానీ `ఆర్‌ఆర్‌ఆర్‌`పై అక్కసు వెళ్లగక్కుతున్నారు ఇండియాకి చెందిన కొందరు సెలబ్రిటీలు. దీనిపై తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ పర్సన్ మేకప్‌ ఆర్టిస్ట్ తన అసూయని వెల్లడించారు. `నాటు నాటు`కి ఆస్కార్‌ రావడాన్ని జీర్ణించుకోలేక తమ నీచపు బుద్దిని బయటపెడుతున్నారు. జాక్వెలిన్‌ మేకప్‌ ఆర్టిస్టు, క్లోజ్‌ ఫ్రెండ్‌ షాన్‌ ముట్టతిన్‌ ఆస్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో అవార్డులను ఈజీగా కొనేస్తారని తెలిపారు. ఇప్పుడు ఆస్కార్‌ని కూడా కొన్నారంటూ దుమారం రేపింది. 

`హహహ.. ఇది చాలా ఫన్నీ, ఇండియాలో చాలా ఈజీగా అవార్డులు కొనేస్తారనుకున్నాను. కానీ ఏకంగా ఆస్కార్‌ని కూడా కొనేస్తారని ఊహించలేదు. అంతా డబ్బు మహిమ, డబ్బుంటే ఏదైనా సాధ్యమవుతుంది. అది ఆస్కార్‌ అయినా` అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నెటిజన్‌ పోస్ట్ కింది షాన్‌ ఈ కామెంట్‌ చేయడం గమనార్హం. దీంతో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంది. దీనిపై నెటిజన్లు దారుణంగా మండిపడుతున్నారు. ఆయన్ని ఓ రేంజ్‌ లో ఆడుకుంటున్నారు.

అయితే జాక్వెలిన్‌ పర్సనల్‌ మేకప్‌ ఆర్టిస్ట్ ఈ కామెంట్‌ చేయడం వెనకాలు ఓ కారణం ఉంది. ఆమె గతేడాది అమెరికా ఇటాలియన్‌ మూవీ `టెల్‌ ఇట్‌ లైక్‌ ఏ ఉమెన్‌` అనే చిత్రంలో నటించింది. ఈ సినిమాలోని `అప్లాజ్‌` అనే సాంగ్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌కి నామినేట్‌ అయ్యింది. `నాటు నాటు`తో పోటీ పడింది. కానీ నాటు నాటు ముందు అది నిలవలేకపోయింది. దీంతో ఆ అసంతృప్తిలో భాగంగా ఇలాంటి కామెంట్‌ చేశాడు మేకప్‌ ఆర్టిస్టు. అయితే ఇది జాక్వెలిన్‌ అభిప్రాయం కూడా అయి ఉండొచ్చు అంటున్నారు. ఈ నేపథ్యంలో వీరినిపై దారుణంగా కామెంట్లు చేస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. 

జాక్వెలిన్‌ ది శ్రీలంక. కానీ ఇండియాలోనే సెటిల్‌ అయ్యింది. ఇక్కడి హీరోయిన్‌గానే రాణిస్తుంది. బాలీవుడ్‌లో స్టార్లందరితోనూ కలిసి నటించింది. ఇప్పుడు ఈ బ్యూటీని ఐటెమ్‌ గర్ల్ గా చేస్తుంది. ఆ మధ్య ప్రభాస్‌ హీరోగా నటించిన `సాహో`లో ఓ స్పెషల్ సాంగ్‌ చేసిన విషయం తెలిసిందే. అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఐటెమ్‌ సాంగ్ లు, స్టార్‌ హీరోయిన్‌గా సినిమాలు చేస్తూ అలరిస్తుంది. ప్రస్తుతం జాక్వెలిన్‌ `క్రాక్‌`, `ఫతేహ్‌` చిత్రాల్లో నటిస్తుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Chiranjeevi-Balakrishna కాంబో సెట్టింగ్‌.. బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించేలా బడా నిర్మాత భారీ స్కెచ్‌
Illu Illalu Pillalu Today Episode Dec 18: అమూల్యకు వార్నింగ్ ఇచ్చిన పెద్దోడు, పెళ్లికి సిద్ధమైన విశ్వ