టబుతోనే సినిమాలు చేస్తారా..? అజయ్ దేవగణ్ కు నెటిజన్ ప్రశ్న, బాలీవుడ్ హీరో ఏమన్నారంటే..?

Published : Mar 16, 2023, 12:42 PM ISTUpdated : Mar 16, 2023, 12:48 PM IST
టబుతోనే సినిమాలు చేస్తారా..? అజయ్ దేవగణ్ కు నెటిజన్ ప్రశ్న, బాలీవుడ్ హీరో ఏమన్నారంటే..?

సారాంశం

బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ను చిత్రమైన ప్రశ్న అడిగాడు ఓ నెటిజన్. ఆప్రశ్న విని షాక్ అయిన బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కాస్త తేరుకుని సమాదానం చెప్పారు. ఇంతకీ అజయ్ ఏం సమాధానం చెప్పారు..? 

బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గెలుపోటములతో సబంధం లేకుండా బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నారు అజయ్. రీసెంట్ గా అజయ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో సౌత్ లోకూడా సందడి చేశారు.  ప్రస్తుతం  బాలీవుడ్ లో భోళా సినిమాతో ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేయాలని చూస్తున్నారు. ఇక ఈసినిమా ఈ నెల 30న రిలీజ్ అవుతుండటంతో..  ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్. 

తమిళంలో కార్తీ నటించిన ఖైదీ సినిమాకు హిందీ రీమేక్ గా తెరకెక్కిన ఈ  సినిమా రిలీజ్ కు దగ్గర పడుతుండటంతో.. మూవీ టీమ్ ప్రమోషన్లు స్పీడ్ పెంచింది. బయట ప్రమోషన్లు సరేసరి.. వాటితో పాటు అజయ్ దేవగణ్ కూడా సోషల్ మీడియా ప్రచారం స్టార్ట్ చేశారు.  ఈ నేపథ్యంలో  ట్విట్టర్ లో ఆస్క్ భోళా అంటూ అభిమానులతో అజయ్ ముచ్చటించారు. సషల్ మీడియలో అభిమానుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు అజయ్ దేవగణ్. ఈసందర్భంగా ఓ చిత్రమైన ప్రశ్న అతనికి ఎదురయ్యింది. 

 

ఓ అభిమాని అజయ్ దేవగణ్ ను  అసక్తికర ప్రశ్న అడిగాడు. మీరు అన్ని సినిమాలు టబుతోనే చేస్తున్నారు. దీనికి ఏదైనా కారణం ఉందా? అని ట్వీట్ చేశాడు. దీనికి కాస్త షాక్ అయిన  అజయ్.. ఈ ప్రశ్నకు  బదులిస్తూ.. ఎందుకంటే.. ఆమె డేట్స్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి అని ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు.  దాంతో ప్రస్తుతం  ఈ  ట్వీట్లకు సబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

దృశ్యం, దృశ్యం 2, గోల్ మాల్ అగైన్, దేదే ప్యార్ దే, విజయ్ పథ్, హఖీఖత్, తక్షక్ తదితర సినిమాల్లో అజయ్ దేవగణ్, టబు కలిసి నటించారు. ఇక ఈ ప్రశ్నతో పాటు..మరో ప్రశ్నకు కూడా అద్భుతమైన ఆన్సర్ ఇచ్చారు అజయ్.  వీటితో పాటు భోళా  సినిమా ఎంత రాబడుతుందని మీరు అనుకుంటున్నారు అని ఓ నెటిజన్ అడగ్గా.. ఎంత డబ్బు కలెక్ట్ చేస్తుందో తెలియదు కానీ.. మీ ప్రేమను పొందుతుందని మాత్రం ఆశిస్తున్నా అని అజయ్ బదులిచ్చి.. నెటిజన్ల మనసు దోచుకునే ప్రయత్నం చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi-Balakrishna కాంబో సెట్టింగ్‌.. బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించేలా బడా నిర్మాత భారీ స్కెచ్‌
Illu Illalu Pillalu Today Episode Dec 18: అమూల్యకు వార్నింగ్ ఇచ్చిన పెద్దోడు, పెళ్లికి సిద్ధమైన విశ్వ