కళ్యాణ్ రామ్ స్పీచ్ తో ఏడ్చేసిన ఎన్టీఆర్!

By Udayavani DhuliFirst Published Oct 2, 2018, 8:46 PM IST
Highlights

యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అరవింద సమేత' సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పాటలను విడుదల చేసింది చిత్రబృందం. 

యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అరవింద సమేత' సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పాటలను విడుదల చేసింది చిత్రబృందం.  ఈరోజు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. సినిమా ట్రైలర్ ని విడుదల చేసిన కళ్యాణ్ రామ్.. ''త్రివిక్రమ్ తమ్ముడి కాంబినేషన్ ఎప్పుడు జరుగుతుందని అభిమానులతో పాటు నేను కూడా ఎదురుచూశాను.

 అధ్బుతమైన దర్శకుడు, నటుడు కలిస్తే ఎలా  ఉంటుందో మచ్చుకు ఈ సినిమా ట్రైలర్ చూపించాం. నెల క్రితం ఓ సంఘటన జరిగినప్పుడు సినిమా రిలీజ్ కాదేమోనని చాలా మంది అనుకున్నారు. మా నాన్నగారు చెప్పిన విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

1962 లో పొద్దునే మేకప్ వేసుకొని షూటింగ్ వెళ్లిన తాతగారు.. షూటింగ్ లో ఉండగా ఆయన పెద్ద కొడుకు నందమూరి రామకృష్ణ గారు కాలం చెందారనే వార్త ఫోన్ లో విన్నారు. అది విని ఏ తండ్రి తట్టుకోలేడు.. కానీ తాతగారు మేకప్ వేసుకొనే నిర్మాతకు నష్టం రాకుడదని రోజంతా షూటింగ్ లోనే ఉన్నారు. తన పని పూర్తి చేసుకొని అప్పుడు వెళ్లారు. ఏ తండ్రైనా.. చేతికొచ్చిన కొడుకు కాలం చెందారని తెలిస్తే ఉండగలరా..? అది ఆయన వృత్తి ధర్మం.

అలానే 1976లో మా ముత్తాత గారు చనిపోయారని తాతగారికి ఫోన్ వచ్చినా.. ఆయన షూటింగ్ పూర్తి చేసుకొనే వెళ్లారు. 1982 లో బాలకృష్ణ బాబాయ్ పెళ్లి. ఎన్నికల ప్రచారంలో ఉండి తాతగారు పెళ్లికి కూడా అటెండ్ కాలేదు. ప్రజలకు సేవ చేయాలనే కృషితో పెళ్లికి కూడా వెళ్లలేదు.

తన తల్లికి ఇచ్చిన మాట కోసం మా నాన్నగారు తాతగారి వెంటే ఉండి.. ఆఫీస్ బాయ్ లా, డ్రైవర్ గా ఆయన వెన్నంటే ఉండి కొడుకు కర్తవ్యాన్ని నెరవేర్చారు. ఆగస్ట్ 29, 2018 మా ఇంట్లో ఓ సంఘటన జరిగింది. ౩౦ రోజులు షూటింగ్ ఉంది అరవింద సమేత అవుతుందా..? అనుకున్నారు. కానీ ఐదో రోజే తమ్ముడు షూటింగ్ కి వెళ్లాడు. రాత్రింబవళ్లు షూటింగ్ చేసి సినిమాను పూర్తి చేశారు.

''నాన్న నువ్ ఎక్కడకి వెళ్లలేదు.. మా అందరి మనస్సులో  గుండెల్లో ఉండిపోయావు..  నువ్ నేర్పించిన విషయాలు మేము ఎప్పటికీ మరచిపోము.. నిర్మాత బాగుండాలి.. వృత్తి పట్ల బాధ్యతగా ఉండాలని నువ్ చెప్పిన మాటలను నేను తమ్ముడు ఫాలో అవుతాం. నువ్ ఎప్పటికీ మాతోనే ఉంటావ్ నాన్న' అంటూ ఎమోషనల్ అయ్యారు. 

సంబంధిత వార్తలు.. 

ఈ ఒక్క అడుగు వంద అడుగులతో సమానం.. 'అరవింద సమేత' ట్రైలర్ టాక్!

'అరవింద సమేత' ప్రీరిలీజ్: ఎన్టీఆర్ రాకతో అభిమానుల కేకలు

'అరవింద సమేత' ప్రీరిలీజ్ హడావిడి.. భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానులు!

'అరవింద సమేత' ప్రీరిలీజ్ ఎలా ఉండబోతుందంటే!

'అరవింద సమేత' ప్రీరిలీజ్ ఈవెంట్.. బాలయ్య కనిపించడా..?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!

అరవింద సమేత.. అసలు కాన్సెప్ట్ ఇదేనట?

 

click me!