'అరవింద సమేత' ట్రైలర్.. 'ఈ ఒక్క అడుగు వంద అడుగులతో సమానం..'!

Published : Oct 02, 2018, 08:24 PM ISTUpdated : Oct 03, 2018, 10:13 AM IST
'అరవింద సమేత' ట్రైలర్..  'ఈ ఒక్క అడుగు వంద అడుగులతో సమానం..'!

సారాంశం

యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అరవింద సమేత' సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పాటలను విడుదల చేసింది చిత్రబృందం.

యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అరవింద సమేత' సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పాటలను విడుదల చేసింది చిత్రబృందం. ఈరోజు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది చిత్రబృందం.

ఇందులో భాగంగా సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. లవ్, ఫ్యాక్షనిజం, ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో సాగిన ఈ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకోవడం ఖాయం. ట్రైలర్ లో చెప్పిన ప్రతి డైలాగ్ ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. మచ్చుకు కొన్ని 

''ఈడ మంది లేరా.. కత్తుల్లేవా..'' 

''ముప్పై ఏండ్ల నాడు మీ తాత కత్తి పట్టినాడంటే.. అది అవసరం.. అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే అది వారసత్వం.. అదే కత్తి నువ్ దూసినావంటే అది లక్షణం.. ఆ కత్తి నీ బిడ్డ నాటికి లోపమైతుందా..?''

''వంద అడుగుల్లో నీరు పడుతుందంటే తొంబై తొమ్మది అడుగులు వరకు తవ్వి ఆపేసావాడిని ఏం అంటారు.. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఈ ఒక్క అడుగు వంద అడుగులతో సమానం.. తవ్వి చూడండి'' అనే డైలాగులు ట్రైలర్ కి హైలైట్ గా నిలిచాయి. 
 

PREV
click me!

Recommended Stories

2025 Flop Heroines: 2025లో ఫ్లాప్ సినిమాలతో పోటీ పడ్డ హీరోయిన్లు.. వాళ్ళిద్దరికీ మూడేసి డిజాస్టర్లు
Sobhan babu జీవితాన్ని ఒక్క సినిమాతో నిలబెట్టిన ఎన్టీఆర్, ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా?