
అందాల తార కాజల్ చెల్లెలిగా సినీరంగ ప్రవేశం చేసింది నిషా అగర్వాల్. ‘ ఏమైంది ఈవేళ’, సోలో వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఆ తర్వాత ఆమెకు పెద్దగా హిట్లు రాలేదు. ఆమె సోదరి కాజల్ వరస అవకాశాలతో దూసుకుపోతుండగా నిషా కి మాత్రం ఛాన్సులు రాలేదు. దీంతో అక్క వివాహం కాకుండానే ఈ చెల్లి పెళ్లిపీటలెక్కేసింది.
ముంబయికి చెందిన ఓ ప్రముఖ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్న నిషా.. వ్యాపార రంగంలో అడుగుపెట్టిందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే.. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాలుగు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న నిషా.. ప్రస్తుతం తల్లి కాబోతోందట. ఈ విషయాన్ని నిషా కుటుంబసభ్యులు కూడా ధ్రువీకరించినట్లు సమాచారం. త్వరలోనే కాజల్ వాళ్లింట్లో బుల్లి పాపాయి సందడి చేయబోతోందని టాలీవుడ్ టాక్.