శింబు, హన్సికలు విడిపోవడానికి అసలు కారణం ఇదేనట!

Published : Sep 19, 2017, 04:14 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
శింబు, హన్సికలు విడిపోవడానికి అసలు కారణం ఇదేనట!

సారాంశం

కొన్ని సంవత్సరాల పాటు సాగిన శింబు, హన్సికల ప్రేమ పెళ్లి పీటలు ఎక్కకముందే విడిపోయిన శింబు, హన్సిక అసలు కారణం ఇదేనంటున్న శింబు తండ్రి

తమిళ హీరో శింబు, హన్సికల ప్రేమాయణం గురించి తెలియని వారుండరు. మొదట నయనతారతో ప్రేమ వ్యవహారం  నడిపిన శింబు.. ఆ తర్వాత ఆమెతో విడిపోయాడు. ఆ తర్వాత  హన్సికను ప్రేమించాడు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపాయి.. త్వరలోనే వివాహం చేసుకుంటున్నారు అని వార్తలు కూడా వచ్చాయి. పెళ్లి తేదీ ఎప్పుడు చెబుతారా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో వారిద్దరూ విడిపోయినట్లు వార్తలు వచ్చాయి.

 

శింబుతో తాను విడిపోయానని.. అతనిని ప్రేమించడం  తాను చేసిన పెద్ద తప్పని.. ఇక జీవితంలో అలాంటి తప్పు మళ్లీ చేయనంటూ హన్సిక చెప్పింది. అసలు వాళ్లిద్దరూ ఎందుకు విడిపోయారనే విషయం మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

 

 తాజాగా శింబు తండ్రి , ప్రముఖ దర్శక నిర్మాత టి. రాజేందర్ ఈ విషయం గురించి మాట్లాడారు. శింబుకి హన్సిక అంటే చాలా ఇష్టమని చెప్పారు. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించవద్దని శింబు హన్సికని కోరాడట. అది నచ్చకే హన్సిక.. శింబుని విడిచి పెట్టిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం శింబు ధైవారాధనలో ఉన్నాడని ఆయన తెలిపారు. శింబు జీవితాన్ని ప్రస్తుతం  తన చేతుల్లో పెట్టాడని.. మీకు నచ్చినట్లు చెయ్యండి నాన్న అంటున్నాడని రాజేందర్ చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?
Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్