
బాలిక వధు( చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్ ద్వారా పాపులారిటీ సంపాధించుకొని సినీరంగ ప్రవేశం చేసిన నటి అవికాగౌర్. తెలుగులో రాజ్ తరణ్ సరసన ‘ ఉయ్యాల జంపాల’ చిత్రంలో నటించి మెప్పించిన అవికా.. తర్వాత లక్ష్మిరావే మా ఇంటికి, సినిమా చూపిస్త మావా, ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమాల్లో నటించింది. తర్వాత.. అసలు కనిపించకుండా పోయింది. చదువు కోసం సినిమాల్లో గ్యాప్ తీసుకుందని ప్రచారం జరిగింది.
అయితే.. తాను సినిమాల్లో కనిపించడానికి గల అసలు కారణం అది కాదని అవికా తాజగా తెలిపింది. కొందరు సినీ పెద్దలు తనకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పింది. తనకు వస్తున్న అవకాశాలను ఆ సినీ పెద్దలు కావాలని చెడ గొడుతున్నారని, దర్శక నిర్మాతలకు చెప్పి మరీ అడ్డుకుంటున్నారని వాపోయింది. కానీ ఆ సినీ పెద్దలు ఎవరో మాత్రం అవికా చెప్పలేదు.
దీంతో అవికాతో గొడవలు పెట్టుకునేంత ద్వేషం ఉన్న సినీ పెద్దలు ఎవరు ఉన్నారబ్బా అని ఆలోచనలో పడ్డారు పలువురు. ప్రస్తుతం అవికా.. బాలీవుడ్ లో సినిమా ప్రయత్నాలు చేస్తోంది.