భర్తను నటుడుగా మార్చనున్న కాజల్... ఇదేం ట్విస్ట్

By team telugu  |  First Published Nov 16, 2021, 11:06 AM IST

సంచలన నిర్ణయం తీసుకుందట కాజల్. తన సినిమాలలో గౌతమ్ కి ఏదో ఒక ప్రాధన్యం ఉన్న పాత్ర ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారట.


చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది కాజల్ (kajal aggarwal). మెగాస్టార్ చిరు (chiranjeevi )- చరణ్ ల మల్టీస్టారర్ ఆచార్య (acharya)తో పాటు.. మరో రెండు మూడు సినిమాలకు కూడా కమిట్మెంట్ ఇచ్చింది కాజల్. కాగా కాజల్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. ఆమె తన భర్తను నటుడుగా మార్చాలని తాపత్రయ పడుతున్నారట. ఉతాను సైన్ చేస్తున్న చిత్రాల దర్శకనిర్మాతలకు భర్త గౌతమ్ కోసం కాజల్ కొన్ని కండీషన్లు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అవి విన్న తర్వాత దర్శక నిర్మాతలు కూడా ఆశ్చర్యపోతున్నారు.

ఇటీవల మొదటి యానివర్సరీ జరుపుకున్న కాజల్, కిచ్లు అన్యోన్య దాంపత్యం అనుభవిస్తున్నారు. ముఖ్యంగా కాజల్ భర్త కోసం అన్నీ తానై ప్రవర్తిస్తుంది. ఆయన వ్యాపార సంస్థల ఉత్పత్తులకు ప్రచార కర్తగా కాజల్ వ్యవహారిస్తున్నారు. అయితే అంతటితో ఆగకుండా... మరో సంచలన నిర్ణయం తీసుకుందట కాజల్. తన సినిమాలలో గౌతమ్ కి ఏదో ఒక ప్రాధన్యం ఉన్న పాత్ర ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారట.

Latest Videos

Also read 2010లో ఆగిపోయిన రాంచరణ్, కాజల్ మూవీ.. మెగా పవర్ స్టార్ డ్రీమ్ నెరవేరబోతోంది

చిన్న పాత్రైనా పర్లేదు.. కీలకంగా ఉంటే చాలంటున్నట్లు తెలుస్తుంది.తనకు కూడా స్క్రీన్‌పై కనిపించాలని ఉందని భర్త కోరడంతోనే కాజల్ ఇదంతా చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఒకవేళ నిజంగానే కాజల్ భర్త కూడా తెరంగేట్రం చేస్తే.. అతడితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుందేమో చూడాలి.

Also read కాజల్ అగర్వాల్ అవుట్.. గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన త్రిష

ఒకప్పటి డిమాండ్ కాజల్ కి ఇప్పుడు లేదు. నిజంగా ఆమె ఇలాంటి కండిషన్స్ పెడితే ఆమె కెరీర్ చాలా త్వరగా ముగియడం ఖాయం. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాలు కూడా చేస్తుంది కాజల్.

click me!