కాజల్‌పై బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన షణ్ముఖ్‌.. నామినేషన్లో ఒక్కరు తప్ప అందరు.. ఈ సారి రచ్చే

Published : Nov 16, 2021, 12:17 AM IST
కాజల్‌పై బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన షణ్ముఖ్‌.. నామినేషన్లో ఒక్కరు తప్ప అందరు.. ఈ సారి రచ్చే

సారాంశం

సోమవారం జరిగిన ఆటని చూస్తే.. ప్రస్తుతం 72వ ఎపిసోడ్‌ రన్‌ అవుతుంది. అంటే 71వ రోజుకి చేరుకుంది. సోమవారం ఆటలో మొదట ఇంటి సభ్యులు ఎలిమినేషన్‌ ప్రాసెస్‌తోపాటు తమ మధ్య ఏర్పడిన కాన్ఫ్లిక్ట్స్ గురించి చర్చించుకున్నారు.

బిగ్‌బాస్‌ తెలుగు 5(Bigg Boss Telugu 5) షో రోజు రోజుకి ఆసక్తిని పెంచుతుంది. ఇంటి సభ్యుల మధ్య వాగ్వాదాలు, గేమ్‌లో వాళ్లు పాల్గొంటున్న విధానం ఆడియెన్స్ ని బాగా ఎంటర్‌టైన్‌ చేస్తున్నాయి. ఇప్పటి వరకు పది వారాలు ముగిశాయి. పది మంది ఎలిమినేట్‌ అయ్యారు. ఇప్పుడు పదకొండే వారంలోకి చేరింది. ప్రస్తుతం హౌజ్‌లో తొమ్మిది మంది మిగిలి ఉన్నారు. సన్నీ(Sunny), రవి, షణ్ముఖ్‌(Shanmukh), మానస్‌, శ్రీరామ్‌, సిరి, అనీ మాస్టర్‌, కాజల్‌, ప్రియాంక ఉన్నారు. పదో వారంలో అనారోగ్యం కారణంగా జెస్సీ హౌజ్‌ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇంకా ఐదు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఇందులో ఎవరు టాప్‌ 5లోకి వెళ్తారనేది మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

ఇదిలా ఉంటే సోమవారం జరిగిన ఆటని చూస్తే.. ప్రస్తుతం 72వ ఎపిసోడ్‌ రన్‌ అవుతుంది. అంటే 71వ రోజుకి చేరుకుంది. సోమవారం ఆటలో మొదట ఇంటి సభ్యులు ఎలిమినేషన్‌ ప్రాసెస్‌తోపాటు తమ మధ్య ఏర్పడిన కాన్ఫ్లిక్ట్స్ గురించి చర్చించుకున్నారు. ఎప్పటిలాగే సన్నీ, మానస్‌, కాజల్‌ ఓ గ్రూపుగా, షణ్ముఖ్‌, సిరి, రవిలు ఒక గ్రూపుగా ఉన్నారు. గుసగుసలాడుకున్నారు. అనంతరం పదకొండో వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన నామినేషన్‌(Bigg Boss Telugu 5 Nominations) ప్రక్రియ జరిగింది. ఇది కాస్త కూల్‌గానే జరిగిందని చెప్పొచ్చు. గతంలో నామినేషన్‌ అంటే ఒకరిపై ఒకరు రెచ్చిపోయి కామెంట్లు చేసుకునేవారు. కానీ ఒకటి రెండు తప్ప పెద్దగా వాదనలు జరగలేదు. 

ఇందులో కెప్టెన్‌ రవి(Anchor ravi) నామినేషన్ల ప్రక్రియని ప్రారంభించాడు. ఆయన సన్నీ, కాజల్‌ లను నామినేట్‌ చేశాడు. సన్నీ.. తనకు ఫేక్‌ ట్యాగ్‌ ఇవ్వడంపై నామినేట్‌ చేశాడు. కాజల్‌ తీరుని ఆయన వ్యతిరేకిస్తూ నామినేట్‌ చేశాడు. మరోవైపు షణ్ముఖ్‌..కాజల్‌, ప్రియాంకలను నామినేట్‌ చేశాడు. కాజల్‌ హౌజ్‌ నుంచి వెళ్లిపోతే గొడవలు ఆగిపోతాయనే పెద్ద స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు షణ్ముఖ్‌. ప్రియాంకని సంబంధించి ఆమె ఫైర్‌ అవుతున్న విధానాన్ని వ్యతిరేకించాడు. మరోవైపు మానస్‌.. అనీ మాస్టర్‌, షణ్ముఖ్‌లను నామినేట్‌ చేశాడు. అలాగే శ్రీరామ్‌.. సన్నీ, మానస్‌లను నామినేట్‌ చేశాడు. 

సిరి.. ప్రియాంక కాజల్‌లను నామినేట్‌ చేయగా, ప్రియాంక.. సిరి, షణ్ముఖ్‌లను నామినేట్‌ చేసింది. సన్నీ.. శ్రీరామ్‌, సిరిలను నామినేట్‌ చేశారు. అనీ మాస్టర్‌.. మానస్‌, కాజల్‌లను నామినేట్‌ చేశారు. అంతేకాదు తనని కాజల్‌ నామినేట్‌ చేసిన సమయంలో వెటకారంగా డాన్సు వేసింది అనీ. ఇదే తనకు నచ్చదని కాజల్‌ చెప్పినా వినకుండా అలానే చేసింది. మరోవైపు తాను నామినేట్‌ చేసే సమయంలోనూ అదే మాదిరిగా డాన్సు  చేసింది. ఇందులో అనీ మాస్టర్‌ వ్యవహరించిన విధానం పట్ల కాజల్‌తోపాటు ఇతర సభ్యులు కూడా ఇబ్బంది పడటం గమనార్హం. 

also read: Bigg boss telugu 5: ఎలిమినేషన్ లో కూడా స్నేహం చాటుకున్న జెస్సీ, షన్ను నుండి దీప్తికి ప్రేమ రాయబారం

ఫైనల్‌గా ఈ వారం నామినేషన్‌లో కెప్టెన్ రవి తప్ప షణ్ముఖ్‌, సిరి, శ్రీరామ్‌, అనీ మాస్టర్‌, ప్రియాంక, మానస్‌, కాజల్‌, సన్నీ ఇలా అందరు ఉన్నారు. దీంతో పదకొండే వారం ఎలిమినేషన్‌ ప్రాసెస్‌ మరింత ఆసక్తిని రేకెత్తించబోతుందని చెప్పొచ్చు. పదో వారంలో కాజల్‌, మానస్‌లో ఒకరు ఎలిమినేట్‌ కావాల్సి ఉన్నా.. జెస్సీని అనారోగ్యం కారణంగా బయటకు పంపించారు. దీంతో వాళ్లిద్దరి ఊపిరి పీల్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ వారం ఎవరు వెళ్తారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. 

also read: Radheshyam: పాటలోనే కథ అంతా లీక్‌... `మగధీర`స్టోరీని దించేశారా? ప్రూఫ్స్‌ ఇవే..

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే