Bigg boss telugu5: లీకైన జెస్సీ రెమ్యూనరేషన్ పది వారాలకు ఎంత తీసుకున్నాడంటే!

Published : Nov 16, 2021, 10:09 AM IST
Bigg boss telugu5: లీకైన జెస్సీ రెమ్యూనరేషన్ పది వారాలకు ఎంత తీసుకున్నాడంటే!

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 5 (Bigg boss telugu5) స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరైన మోడల్ జస్వంత్ అలియాస్ జెస్సీ అనారోగ్య కారణాలతో హౌస్ వీడిన విషయం తెలిసిందే. వారం రోజులుగా జెస్సీ అనారోగ్యంతో హౌస్ లో బాధపడుతున్నాడు. కాగా జెస్సీ రెమ్యూనరేషన్ లీక్ కావడం జరిగింది . 

స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్న జెస్సీ(Jessie) అనారోగ్యం బారినపడ్డారు. దీనితో జెస్సీ ని ఇంటి నుండి బయటికి పంపిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చి, సీక్రెట్ రూమ్ కి తరలించాడు బిగ్ బాస్. వారం రోజులు సీక్రెట్ రూమ్ కి పరిమితమైన జెస్సీ, కి డాక్టర్స్ వైద్యం అందించారు. కొన్ని ఆరోగ్య పరీక్షల కోసం బయట ఆసుపత్రికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే జెస్సీ ఆరోగ్యం మెరుగుపడలేదు. దీనితో జెస్సీ ని ఈ వారం హౌస్ నుండి బయటికి పంపేశారు బిగ్ బాస్.


నిజానికి కాజల్, మానస్ లలో ఒకరు హౌస్ నుండి ఎలిమినేట్ కావాల్సి ఉండగా, వారిని సేవ్ చేసి జెస్సీ ని హౌస్ నుండి బయటికి పంపడం చేశారు. ఇక మొత్తం పదివారాలు హౌస్ లో ఉన్నాడు జెస్సీ. ఈ పది వారాలకు జెస్సీ రెమ్యూనరేషన్ రూపంలో బాగానే ముట్టినట్లు తెలుస్తుంది. వారానికి 1.5 లక్షల ఒప్పందంపై జెస్సీ హౌస్ లోకి వెళ్లారట. కాబట్టి పది వారాలకు రూ. 15లక్షల వరకు తీసుకున్నాడని సమాచారం.


ఇక హౌస్ లో షణ్ముఖ్, సిరిల బెస్ట్ ఫ్రెండ్ గా జెస్సీ మెలిగాడు. వచ్చేటప్పుడు వాళ్లకు మంచి టిప్స్ చెప్పి రావడం జరిగింది. మరో వైపు జెస్సీ హెల్త్ కండిషన్ అంతా బిగ్ బాస్ గేమ్ అన్న మాట కూడా వినిపిస్తుంది. ఈ వారం హౌస్ నుండి జెస్సీ ని బయటకు పంపాలని డిసైడ్ అయిన బిగ్ బాస్ ఈ నాటకం ఆడారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Also read కాజల్‌పై బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన షణ్ముఖ్‌.. నామినేషన్లో ఒక్కరు తప్ప అందరు.. ఈ సారి రచ్చే
హౌస్ నుండి బయటికి వచ్చిన జెస్సీ చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నాడు. గత సీజన్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అలీ రేజా, రాహుల్ లతో పాటు శ్వేతా వర్మ అతడికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. జెస్సీ వరుస పార్టీలలో పాల్గొంటున్నారు. పారదర్శకత లేని బిగ్ బాస్ ఓటింగ్, ఎలిమినేషన్స్ పై చాలా కాలంగా అనుమానాలు ఉన్నాయి. ఓటింగ్ ఆధారంగా కాకుండా ఎలిమినేషన్ జరుగుతుంది అని చాలా మంది భవిస్తున్నారు.

Also read సంపూ నుండి జెస్సీ వరకు ఎలిమినేట్ కాకుండానే బిగ్ బాస్ హౌస్ వీడిన కంటెస్టెంట్స్ ఎవరో తెలుసా? టార్చర్ తట్టుకోలేక!
 

PREV
click me!

Recommended Stories

Karan Johar: ఆలియా, షారుఖ్ ఖాన్ లని అన్ ఫాలో చేసిన కరణ్ జోహార్.. ఇద్దరితో గొడవలా ?
Ram Charan Peddi: పెద్ది ఎవరి కోసం చూడాలి ? అసలెందుకు చూడాలి ?.. 5 కారణాలు ఇవే