మేనేజర్ రోనీ అరెస్ట్ పై కాజల్ అగర్వాల్ ట్వీట్

Published : Jul 25, 2017, 01:23 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
మేనేజర్ రోనీ అరెస్ట్ పై కాజల్ అగర్వాల్ ట్వీట్

సారాంశం

డ్రగ్స్ కేసులో అరెస్టయిన కాజల్ మేనేజర్ రోనీ రోనీ అరెస్టు షాక్ కు గురిచేసిందన్న కాజల్ రోనీ వ్యక్తిగత జీవితంతో తనకు సంబంధం లేదని ట్వీట్

గత కొంత కాలంగా డ్రగ్స్ దందాకు సంబంధించిన అరెస్టుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ అగ్ర నటి కాజల్ అగర్వాల్ మేనేజర్ రోనీ పట్టుబడటం సంచలనం రేపింది. నిన్న రోనీ ఇంట్లో గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. దీనిపై కాజల్ అగర్వాల్ ట్వీట్ ద్వారా స్పందించింది.

 

"రోనీ అరెస్టు విషయం తెలిసి షాక్ అయ్యాను. చట్ట వ్యతిరేక పనులను నేను సమర్థించను. రోనీ వ్యక్తిగత జీవితంతో నాకు సంబంధం లేదు. నా వద్ద కొంత కాలం పనిచేసినంత మాత్రాన నేను ఇలాంటి విషయాల్లో ఎంకరేజ్ చేస్తానని అనుకోవడం పొరబాటే అవుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా.. నా కెరీర్, డేట్స్ వ్యవహారాలన్నీ అందరికన్నా మిన్నగా నా తల్లిదండ్రులే చూస్తున్నారు.  నేను పరిశ్రమలో ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా, ప్రొఫెషనల్ గా వుంటాను. నాతో పని చేసిన వారు విధులు ముగిశాక ఏం చేస్తున్నారు, ఎక్కడుంటున్నారు అనేది నాకు పూర్తిగా సంబంధం లేని విషయం" అని కాజల్ ట్వీట్ చేసింది.

 

ఇక నిన్న టాలీవుడ్ అగ్ర నటి కాజల్ అగర్వాల్ మేనేజర్ రోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. రోనీ ఇంట్లో గంజాయి లభ్యం కావటంతో సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. రోనీ కాజల్ తో పాటు లావణ్య త్రిపాఠి, రాశి ఖన్నాలకు కూడా మేనేజర్ గా వ్యవహరించాడు. కాజల్ ను తొలినాళ్లలో దర్శకుడు తేజ తెరకెక్కించిన లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా పరిచయం చేశారు. అప్పటి నుండి కాజల్ కు సంబంధించిన వ్యవహారాలు మేనేజ్ చేసిన రోనీ ఇప్పుడు పట్టుబడటం కాజల్ ను ఒకింత షాక్ కు గురిచేసింది.

PREV
click me!

Recommended Stories

త్రిష ,కాజల్ తో పాటు బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్లుగా కెరీర్ మొదలుపెట్టిన, 8 మంది స్టార్స్ ఎవరో తెలుసా?
Nari Nari Naduma Murari మూవీపై బాలకృష్ణ క్రేజీ రియాక్షన్‌.. శర్వానంద్‌ బతికిపోయాడు