ముగిసిన నవదీప్ విచారణ, సిట్ కు సహకరించా-నవదీప్

Published : Jul 24, 2017, 09:50 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
ముగిసిన నవదీప్ విచారణ, సిట్ కు సహకరించా-నవదీప్

సారాంశం

డ్రగ్స్ కేసులో ముగిసిన నవదీప్ విచారణ 11 గంటలపాటు నవదీప్ ను విచారించిన సిట్ సిట్ విచారణకు పూర్తిగా సహకరించానన్న నవదీప్

డ్రగ్స్ కేసులో సిట్ విచారణ ఐదోరోజు ముగిసింది. సోమవారం హీరో నవదీప్ ను విచారించిన సిట్ పలు కీలక అంశాలకు సంబంధించిన సమాచారం రాబట్టినట్లు సమాచారం. దాదాపు 11 గంటలపాటు నవదీప్ ను విచారించిన సిట్ అధికారులు అనేక టఫ్ ప్రశ్నలతో నవదీప్ ను ఉక్కిరి బిక్కిరి చేసినట్లు సమాచారం. ఇక సిట్ అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని, తాను విచారణకు పూర్తిగా సహకరించానని నవదీప్ తెలిపారు. మళ్లీ విచారణ వుందా అని అడగ్గా... లేదు. అవసరమైతే ఫోన్ చేస్తామన్నారని నవ్ దీప్ చెప్పారు.

 

మరోవైపు సిట్ విచారణకు ఆటంకం కలిగేలా ఎవరు మాట్లాడినా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ స్పష్టం చేశారు. ఇప్పటికే సిట్ అధికారుల విచారణలో కేవలం టాలీవుడ్ కు సంబంధించే కాక.. స్కూల్ విద్యార్థులకు సంబంధించి కూడా కొన్ని వాస్తవాలు తెలిశాయని, అయితే విద్యార్థుల భవిష్యత్ నాశనం చేసే ఉద్దేశం లేకనే వారి పేర్లు చెప్పట్లేదని అకున్ స్పష్టం చేశారు.

 

ఇక రేపు ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను సిట్ విచారించనుంది. 26న చార్మి, 27న ముమైత్, ఆ తర్వాత నందు, తనీష్, శ్రీనివాసరావులను సిట్ విచారించనుంది.

PREV
click me!

Recommended Stories

త్రిష ,కాజల్ తో పాటు బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్లుగా కెరీర్ మొదలుపెట్టిన, 8 మంది స్టార్స్ ఎవరో తెలుసా?
Nari Nari Naduma Murari మూవీపై బాలకృష్ణ క్రేజీ రియాక్షన్‌.. శర్వానంద్‌ బతికిపోయాడు