హైకోర్టులో ఛార్మి పిటిషన్ పై వాడివేడి వాదనలు, మ.2.30కు తీర్పు

Published : Jul 25, 2017, 11:59 AM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
హైకోర్టులో ఛార్మి పిటిషన్ పై వాడివేడి వాదనలు, మ.2.30కు తీర్పు

సారాంశం

డ్రగ్స్ కేసులో విచారణకు హాజరవుతానని.. సడెన్ గా యు టర్న్ తీసుకున్న ఛార్మి విచారణలో అనుమతి లేకుండా శాంపిల్స్ సేకరిస్తున్నారన్న ఛార్మి కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే నోటీసులిచ్చామన్న సిట్ ఛార్మిని మహిళా అధికారులే విచారిస్తారన్న సిట్

గత కొన్ని వారాలుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో సినీ నటి ఛార్మి హైకోర్టును ఆశ్రయించింది. సిట్ దర్యాప్తు తీరు సరిగా లేదని పిటిషన్ వేసింది ఛార్మి. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తొలుత విచారణకు సిట్ కార్యాలయానికే వస్తానని తెలిపిన ఛార్మి.. సడెన్ గా  యు టర్న్ తీసుకుని హైకోర్టును ఆశ్రయించడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

ఇక ఛార్మి పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు ఇరు పక్షాల వాదోపవాదాలు పరిశీలించింది. కేవలం సిట్  విచారణను తప్పుదోవ పట్టించేందుకే చార్మి పిటిషన్ వేసిందని సిట్ వాదించింది. సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేయట్లేదని చెప్పింది. కేవలం పబ్లిసిటీ స్టెంట్ తప్ప పిటిషన్ వేయటానికి మరో కారణం లేదని సిట్ వాదించింది. పూరీ జగన్ ఇష్టపూర్వకంగానే శాంపిల్స్ ఇచ్చారని సిట్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. నోటీసులు ఇచ్చినప్పుడే కకావాలంటే మీ ఇంటికే వస్తామని చెప్పినట్లు సిట్ స్పష్టం చేసింది. 

ఇక ఛార్మి లాయర్ కూడా వాదనలు బలంగానే వినిపించారు. ఛార్మి నిందితురాలు కాదని, కనీసం సాక్షి కూడా కాదని.. అలాంటప్పుడు శాంపిల్స్ తనకు ఇష్టం లేకుండా ఎలా ఇస్తారని చార్మి లాయర్ వాదించారు.   ఆర్టికల్ 20 ప్రకాలం చార్మికి స్వేచ్ఛాయుత వాతావరణంలో విచారించాలని లాయర్ కోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఈ మధ్యాహ్నం 2.30గంటలకు తీర్పు వెల్లడించనుంది.

 

 

 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్