జూ.ఎన్టీఆర్‌ నెక్ట్స్ సినిమా ఇదే, కానీ చిన్న ట్విస్ట్.. రిలీజ్‌ డేట్‌ కూడా ఫిక్స్?

Published : Mar 09, 2025, 04:34 PM IST
జూ.ఎన్టీఆర్‌ నెక్ట్స్ సినిమా ఇదే, కానీ చిన్న ట్విస్ట్.. రిలీజ్‌ డేట్‌ కూడా ఫిక్స్?

సారాంశం

Ntr Next Movie : జూ ఎన్టీఆర్‌ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. తాజాగా మరో మూవీ కూడా కన్ఫమ్‌ అయ్యింది. అది 2027లో దీన్ని రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.   

Ntr Next Movie : జూ ఎన్టీఆర్‌ సినిమాల లైనప్‌ కూడా భారీగానే ఉంది. క్రమంలో ఒక్కో ప్రాజెక్ట్ యాడ్‌ అవుతుంది. ఇప్పుడు ఆయన చేతిలో కూడా వరుసగా పాన్‌ ఇండియా మూవీస్‌ ఉన్నాయి. గతేడాది `దేవర`తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మూడు సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. తాజాగా మరో మూవీ కూడా ఓకే అయ్యింది. 

`జైలర్‌` ఫేమ్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో భారీ పాన్‌ ఇండియా మూవీ 

ఎన్టీఆర్‌.. తమిళ దర్శకుడుతో ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. `జైలర్‌` ఫేమ్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. అయితే ఇది కన్ఫమ్‌ అయ్యిందట. ఈ మూవీకి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించబోతున్నారు.

వీరి కాంబినేషన్‌లో మూవీ ఓకే అయ్యిందని తెలుస్తుంది. అయితే ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు నిర్మాణ సంస్థ మారిందట. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలోకి దిగింది. అంతేకాదు దర్శకుడికి అడ్వాన్స్ కూడా ఇచ్చారట.

దీంతో ఈ ప్రాజెక్ట్ లాక్‌ అయ్యిందని సమాచారం. అన్ని కుదిరితే వచ్చే ఏడాది ఈ మూవీని స్టార్ట్ చేసి, 2027లో విడుదల చేయాలనేది ప్లాన్‌ అని సమాచారం. ఈ మూవీకిగానూ నెల్సన్‌ ఏకంగా రూ.50కోట్లు పారితోషికం డిమాండ్‌ చేస్తున్నాని సమాచారం.

read  more: జూనియర్ ఎన్టీఆర్ కు డిజాస్టర్ మూవీ, బాలకృష్ణతో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ సినిమా చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?

ప్రస్తుతం ఎన్టీఆర్‌ చేతిలో `వార్‌ 2`, ప్రశాంత్‌ నీల్‌ మూవీ, `దేవర 2`..

ప్రస్తుతం ఎన్టీఆర్‌ హిందీలో `వార్‌ 2`లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ దాదాపుగా అయిపోయింది. ఇటీవలే హృతిక్‌ రోషన్‌, తారక్‌లపై ఓ స్పెషల్‌ డాన్స్ నెంబర్‌ని కూడా షూట్‌ చేశారట. ఇది సినిమాకే హైలైట్‌గా ఉంటుందట. ఇద్దరూ బెస్ట్ డాన్సర్లు, వారిద్దరు కలిస్తే ఆ డాన్స్ ఏం రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ మూవీని ఆగస్ట్ 15న విడుదల చేయాలనుకుంటున్నారట. 

దీంతోపాటు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు తారక్‌. ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభమైంది. త్వరలోనే తారక్‌ ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొనబోతున్నారట. కంటిన్యూగా ఈ మూవీ షూటింగ్‌లోనే ఉంటారు తారక్‌. అనంతరం `దేవర 2`లో జాయిన్‌ అవుతారట. ఈ ఏడాది ద్వితీయార్థంలో `దేవర 2` ఉంటుందని సమాచారం.

దర్శకుడు కొరటాల శివ దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ని ప్రిపేర్‌ చేస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ మూవీ అయిపోయిన వెంటనే తారక్‌.. `దేవర 2`లో జాయిన్‌ అవుతారు. అనంతరం నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ మూవీ స్టార్ట్ కాబోతుంది. ప్రస్తుతం నెల్సన్‌ రజనీకాంత్‌తో `జైలర్‌ 2` మూవీని తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఎన్టీఆర్‌ మూవీపై వర్క్ చేయనున్నారు. 

read more: జయసుధ విషయంలో విసిగిపోయిన ఎన్టీఆర్, సీరియస్‌ వార్నింగ్‌.. దెబ్బకి మళ్లీ ఆ మాట ఎత్తలేదు

also read: రజనీకాంత్ రిజెక్ట్ చేసిన చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన కమల్ హాసన్, ఆ మూవీ ఏంటంటే ?
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్