ఎన్టీఆర్ కుడిచేతికి గాయం, సర్జరీ.. ఫ్యాన్స్ లో కంగారు, అసలేం జరిగిందంటే..

pratap reddy   | Asianet News
Published : Nov 05, 2021, 01:44 PM IST
ఎన్టీఆర్ కుడిచేతికి గాయం, సర్జరీ.. ఫ్యాన్స్ లో కంగారు, అసలేం జరిగిందంటే..

సారాంశం

జిమ్ లో వర్కౌట్లు చేస్తూ సెలబ్రిటీలు గాయాలపాలవుతూ ఉంటారు. కొన్నిసార్లు ఆ గాయాలు ప్రమాదకరం కావచ్చు. అందుకే సెలెబ్రిటీలు తమ ట్రైనర్ ఆధ్వర్యంలో వర్కౌట్స్ చేస్తూ ఉంటారు.

జిమ్ లో వర్కౌట్లు చేస్తూ సెలబ్రిటీలు గాయాలపాలవుతూ ఉంటారు. కొన్నిసార్లు ఆ గాయాలు ప్రమాదకరం కావచ్చు. అందుకే సెలెబ్రిటీలు తమ ట్రైనర్ ఆధ్వర్యంలో వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు గాయాలు తప్పవు. గురువారం రోజు యంగ్ టీజర్ ఎన్టీఆర్ తన ముద్దుల కుమారులిద్దరితో దీపావళి సంబరాల్లో సంతోషంగా కనిపించాడు. 

తన కుమారులతో Jr NTR దిగిన ఫోటో సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే ఎన్టీఆర్ కుడిచేతికి బ్యాండేజ్ లాంటిది కనిపించడంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. ఎన్టీఆర్ చేతికి ఏదో గాయం అయిందని అర్థం అయింది. ఆ గాయం గురించి తాజాగా వివరాలు బయటకు వచ్చాయి. 

Also Read: ముద్దుల కొడుకులతో ఎన్టీఆర్ దీపావళి సెలెబ్రేషన్స్.. ఒకరిని మించి ఒకరు

RRR చిత్ర షూటింగ్, Evaru Meelo Koteeswarulu షూటింగ్ పూర్తి కావడంతో ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యామిలీతో సమయం గడుపుతూ.. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఉన్నాడు. ఎన్టీఆర్ తదుపరి కొరటాల శివ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ కాస్త బాడీ బిల్డ్ చేయాల్సి ఉంది. దీనితో ఎన్టీఆర్ డైలీ జిమ్ లో కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కుడి చేతికి గాయమైనట్లు తెలిసింది. 

ఎన్టీఆర్ డాక్టర్ ని సంప్రదించగా కుడిచేతి వేలు ఒకటి ఫ్రాక్చర్ అయినట్లు తేల్చారు. చిన్నపాటి సర్జరీ అవసరం అని సూచించారు. దీనితో ఎన్టీఆర్ సర్జరీ చేయించుకున్నారట. త్వరలోనే గాయం మానిపోతుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు ఎన్టీఆర్ కు తెలిపారు. సో ఇది చిన్నపాటి గాయమే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కూడా టెన్షన్ అవసరం లేదు. 

Also Read: దీపావళికి అనసూయ మరో ట్రీట్.. ఈసారి ప్యూర్ క్లాసీ లుక్ తో అదరగొట్టేసింది

ఇటీవల Chiranjeevi చేతికి కూడా చిన్న సర్జరీ జరిగింది. అలాగే బాలయ్య భుజానికి కూడా గాయమైంది. స్టార్ సెలెబ్రిటీలకు జిమ్ వర్కౌట్స్ తో పాటు సినిమాల్లో అనేకసన్నివేశాల్లో నటించాల్సి ఉంటుంది. పోరాట సన్నివేశాల్లో మిస్ ఫైర్ అయినప్పుడు హీరోలు గాయాలపాలవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటి గాయాలు కామనే. 

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులంతా ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. గ్లింప్స్ విడుదలయ్యాక ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ ఇంకా పెరిగిపోయింది. ఎన్టీఆర్ ఈ మూవీలో నిజాం, బ్రిటిష్ కి వ్యతిరేకంగా పోరాడిన Komaram Bheem పాత్రలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ పాత్రని రాజమౌళి నీటితో పోల్చుతూ.. రాంచరణ్ పాత్రని నిప్పుతో పోల్చుతూ చూపిస్తున్నారు. గ్లింప్స్ లో ఎన్టీఆర్ పులితో పోరాడే సన్నివేశాలు ఆసక్తిని పెంచేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ జనవరి 7న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. 

Also Read: బ్రేకప్ తర్వాత రెమ్యునరేషన్ పెంచేసిన సమంత.. చాలా దూరంలో పూజ, రష్మిక ?

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రామ్ చరణ్ కు రాజమౌళి పై పీకల దాకా కోపం వచ్చిన సందర్భం ఏంటో తెలుసా? కారణం ఏంటి?
Pawan Kalyan కొత్త సినిమా ఇదే.. కన్ఫమ్‌ చేసిన ప్రొడ్యూసర్‌.. న్యూ ఇయర్‌ సర్‌ప్రైజ్‌