Ravanasura First Look: పది తలల రావణుడిగా రవితేజ.. పవర్ ఫుల్ లుక్ వైరల్

pratap reddy   | Asianet News
Published : Nov 05, 2021, 11:53 AM IST
Ravanasura First Look: పది తలల రావణుడిగా రవితేజ.. పవర్ ఫుల్ లుక్ వైరల్

సారాంశం

మాస్ ప్రేక్షకులకు అసలైన వినోదం రవితేజ సినిమాల్లో ఉంటుంది. అందుకే అతడు మాస్ మహారాజ్ అయ్యాడు. ఆ మధ్యన కొన్ని పరాజయాలు రవితేజని ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన క్రాక్ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు రవితేజ.

మాస్ ప్రేక్షకులకు అసలైన వినోదం రవితేజ సినిమాల్లో ఉంటుంది. అందుకే అతడు మాస్ మహారాజ్ అయ్యాడు. ఆ మధ్యన కొన్ని పరాజయాలు రవితేజని ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన క్రాక్ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు రవితేజ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ, శృతి హాసన్ జంటగా నటించారు. 

క్రాక్ తర్వాత Ravi Teja గేర్ మార్చాడు. వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రవితేజ ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా లాంటి చిత్రాలు చేస్తున్నాడు. తాజాగా మరో చిత్రాన్ని ప్రకటించారు. స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఇటీవల ఓ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు ఆ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ మూవీకి సుధీర్ వర్మ పవర్ ఫుల్ టైటిల్ ఎంచుకున్నారు. 

Also Read: Unstoppable With NBK: చిరంజీవి పెళ్లిపై మోహన్ బాబు కామెంట్స్ వైరల్.. కాబట్టే బాగున్నాడు అంటూ..

'రావణాసుర'(Ravanasura) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ లో రవితేజ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. టైటిల్ కు తగ్గట్లుగానే పోస్టర్ లో రవితేజ పది తలలతో కనిపిస్తున్నాడు. అయితే ఈ రావణుడు పురాణాల్లో తరహాలో రావణుడు కాదు.. మోడ్రన్ రావణుడు. టైటిల్ కు తగ్గట్లుగా రవితేజ పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉండబోతున్నాయని అర్థం అవుతోంది. 

భారీ సుత్తి పట్టుకుని రవితేజ కూర్చుని ఉండగా బ్యాగ్రౌండ్ లో పది తలలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ మొత్తం చాలా ఆసక్తికరంగా, ఒళ్ళు గగుర్పాటుకు గురిచేసేలా రెడిష్ బ్యాగ్రౌండ్ లో ఉంది. మరి రవితేజ ఆ సుత్తితో ఎవరిపై విరుచుకుపడతాడో చూడాలి. 'హీరోలు ఉండరు.. కానీ రాక్షసులు ఉంటారు' అనే పాయింట్ ఆసక్తికరంగా ఉంది. 

Also Read: నడుముపై బిందె, పల్లెటూరి పడుచు పిల్లలా రెచ్చిపోయిన నభా.. లంగాఓణీలో వయ్యారాల విందు

నేను రవితేజ గారి ఆంజనేయులు చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశా. అప్పటి నుంచి ఆయనతో సినిమా చేయాలనే కోరిక ఉండేది. ఆ కల ఇప్పుడు నెరవేరుతోంది అని సుధీర్ వర్మ ట్వీట్ చేశాడు. సుధీర్ వర్మ చివరగా తెరకెక్కించిన రణరంగం చిత్రం నిరాశపరిచింది. దీనితో రవితేజ ' రావణాసుర' మూవీపై సుధీర్ వర్మ గట్టి పట్టుదలతో ఉన్నాడు. 

అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రావణాసుర చిత్ర పూర్తి నటీనటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.   

 

PREV
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్