పవన్ కల్యాణ్ ‘తమ్ముడు’తో ఆమె నటిగా తెరంగేట్రం చేశారు. ఇందులో జానకిగా కనిపించారు. తొలి చిత్రంతోనే తెలుగువారికి బాగా చేరువయ్యారు.
ఒకప్పుడు తెలుగులో హీరోయిన్ గా చేసిన నటి ప్రీతి జింగ్యానీ. ఆమె భర్త, బాలీవుడ్ నటుడు పర్విన్ దాబాస్‌కు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున అతని కారు యాక్సిడెంట్‌కు గురైంది. ఈ యాక్సిడెంట్ లో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. బాంద్రాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఉంచి డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు టీమ్ తెలిపింది.
ప్రీతి జింగ్యానీ తెలుగు వారికి బాగా పరిచయస్దురాలే. పవన్ కల్యాణ్ ‘తమ్ముడు’తో ఆమె నటిగా తెరంగేట్రం చేశారు. ఇందులో జానకిగా కనిపించారు. తొలి చిత్రంతోనే తెలుగువారికి బాగా చేరువయ్యారు. అనంతరం ఆమె దక్షిణాదిలో ఎన్నో మూవీస్‌లో యాక్ట్ చేశారు.
బాలకృష్ణతో 'నరసింహ నాయుడు', నాగార్జునతో 'అధిపతి' రాజేంద్ర ప్రసాద్‌తో 'అప్పారావు డ్రైవింగ్ స్కూల్' లాంటి సినిమాల్లో మెరిశారు. ఇక 'యమదొంగ' సినిమాలోని ఓ సాంగ్‌లో గెస్ట్ రోల్లో కనిపించారు. అయితే తెలుగులో చివరగా ఈమె 'విశాఖా ఎక్స్‌ప్రెస్' సినిమాలో నటించారు. ఆ తర్వాత బాలీవుడ్లో బిజీ అయిపోయారు. తెలుగు, హిందీలోనే కాకుండా ఈమె కన్నడ, ఉర్దూ, పంజాబీ భాషల్లోనూ నటించారు. ఇటీవలే 'కఫాస్' అనే వెబ్ సిరీస్‌లో కనిపించారు. ఇది కూడా ఓటీటీలో మంచి టాక్ అందుకుంది.
ఇక పర్విన్ కూడా బాలీవుడ్లో పాపులర్ నటుడే. ఈయన హిందీలోనే కాకుండా ఇంగ్లీష్, మలయాళం, కన్నడ సినిమాల్లోనూ నటించారు. 'మై నేమ్ ఈజ్ ఖాన్', 'జల్ పరి', 'ఘన్ చక్కర్', 'ముస్కాన్', 'కోస్లా కా ఘోస్లా' లాంటి సినిమాల్లో పర్విన్ యాక్టింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి.
‘లవ్ తుమ్‌హారా’ సెట్‌లో పర్విన్ దాబాస్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. 2008లో వీరి వివాహం జరిగింది. ప్రో పంజా లీగ్ అనే స్పోర్ట్స్ టీమ్‌కు సహ వ్యవస్థాపకుడిగా పర్విన్ వ్యవహరిస్తున్నారు. ఇక ఈ జంటకు వీరికి జైవీర్, దేవ్ అనే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ప్రస్తుతం వీరు అటు ప్రొపషనల్ లైఫ్‌తో పాటు పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ గడుపుతున్నారు. ప్రీతి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల కోసం మూవీ అప్డేట్స్ షేర్ చేస్తుంటారు.