`గ్యాంగ్‌ లీడర్‌`, `ఘరానా మొగుడు` రేంజ్‌లో.. చిరంజీవితో మూవీపై అనిల్‌ రావిపూడి అదిరిపోయే లీక్‌

By Aithagoni Raju  |  First Published Jan 4, 2025, 8:23 AM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత అనిల్‌ రావిపూడితో సినిమా ఉండబోతుంది. అయితే ఇది ఎలా ఉండబోతుందో లీక్‌ ఇచ్చాడు అనిల్‌. 
 


`విశ్వంభర` వీఎఫ్‌ఎక్స్ డిలే..

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. `బింబిసార` ఫేమ్‌ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. `జగదేక వీరుడు అతిలోక సుందరి` తరహాలో సోషియో ఫాంటసీగా తెరకెక్కుతుంది. ఇందులో మైథలాజికల్‌ టచ్‌ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది.

ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ ఈ సమ్మర్‌లో రాబోతుంది. అయితే వీఎఫ్‌ఎక్స్ డిలే అవుతున్నాయని, ప్రస్తుతం చేస్తున్న కంపెనీ వీఎఫ్‌ఎక్స్ సంతృప్తికరంగా లేకపోవడంతో కొత్త కంపెనీకి వర్క్ ఇచ్చారని తెలుస్తుంది. 

Latest Videos

శ్రీకాంత్‌ ఓడెలతో రా అండ్‌ రస్టిక్‌ మూవీ..

ఈ సినిమాతోపాటు `దసరా` ఫేమ్‌ శ్రీకాంత్‌ ఓడెల దర్శకత్వంలో మరో మూవీ చేయబోతున్నారు చిరంజీవి. `చిరుఓడెల` వర్కింగ్‌ టైటిల్‌తో ఇటీవలే ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించారు. చిరంజీవిని గతంలో ఎప్పుడూ చూడని చిరంజీవిని ఇందులో చూపించేందుకు ప్లాన్‌ చేస్తున్నారట శ్రీకాంత్‌ ఓడెల. తన ఫ్యాన్‌ బాయ్‌ మూమెంట్‌ని తెరపై ఆవిష్కరించబోతున్నారని, ఒక అభిమాని సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఈ మూవీలో చిరంజీవిని అలా చూపించబోతున్నారట. 

చిరంజీవి నెక్ట్స్ మూవీ అనిల్‌ రావిపూడితో..

ఇదిలా ఉంటే అనిల్‌ రావిపూడితోనూ ఓ సినిమా చేయబోతున్నారు మెగాస్టార్. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ పై వర్క్ జరుగుతుంది. స్క్రిప్‌ ఫైనల్‌ చేసే పనిలో ఉన్నారట. ఈ మూవీ ఆల్మోస్ట్ కన్ఫమ్‌ అని తెలుస్తుంది.

కాకపోతే ప్రస్తుతం స్క్రిప్ట్ డిస్కషన్‌ స్టేజ్‌లోనే ఉందని తెలిపారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. మెగాస్టార్‌ తో చేయబోయే సినిమా ఎలా ఉండబోతుందో ఆయన ముందే హింట్‌ ఇచ్చాడు. బిగ్‌ లీక్ వార్త వెల్లడించారు. చిరంజీవిని తాను ఎలా చూపించబోతున్నాడో తెలిపారు అనిల్‌.

read more: జూ ఎన్టీఆర్‌ ప్రస్తావన రావద్దు అంటూ బాలయ్య కండీషన్‌? అన్‌స్టాపబుల్‌ షో గెస్ట్ లకు ముందే సూచన, ఇంత పగేంటి?

`గ్యాంగ్‌ లీడర్‌`, `ఘరానా మొగుడు` రేంజ్‌లో..

వింటేజ్‌లో `గ్యాంగ్‌ లీడర్‌`, `ఘరానా మొగుడు`, `రౌడీ అల్లుడు` సినిమాలు చిరంజీవి మాస్‌ని, యాటిట్యూడ్‌ని, క్యారెక్టరైజేషన్‌ని తెలియజేశాయి. ఆ రేంజ్‌లో తాను సినిమా చేయాలని ఉందని, ఓ సరికొత్త క్యారెక్టరైజేషన్‌ పట్టుకుని సినిమా చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. ఎంటర్‌టైన్‌మెంట్ వంద శాతం ఉంటుందని, కానీ కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు, ఇంకా వేరే ఉంది. చిరంజీవిగారితో సూపర్బ్ క్యారెక్టరైజేషన్‌ ట్రై చేయాలని ఉంది.

మాస్‌ ఎలిమెంట్లు పెట్టి బ్యూటీఫుల్ ఎంటర్‌టైనర్‌ చేయాలని ఉంది. `గ్యాంగ్‌ లీడర్‌`, `ఘరానా మొగుడు`, `రౌడీ అల్లుడు` లాగా వాటిలో ఫన్‌తోపాటు ఒక క్యారెక్టరైజేషన్‌ ఉంటుంది. ఒక బిహేవియర్‌ ఉంటుంది, అది లైవ్లీగా ఉంటుంది. ఆయన రోల్‌కి ఒక యాటిట్యూడ్‌ పెట్టి చేస్తే బాగా వర్కౌట్‌ అవుతుంది. ఆయన బాగా చేయగలరు. అదే సమయంలో నా ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా మిస్‌ కాకుండా చేస్తాను` అని తెలిపారు అనిల్‌ రావిపూడి. 

`సంక్రాంతికి వస్తున్నాం`తో అనిల్‌ రావిపూడి..

ప్రస్తుతం ఆయన వెంకటేష్‌ తో `సంక్రాంతికి వస్తున్నాం` అనే సినిమాని రూపొందించారు. ఐశ్వర్యా రాజేష్‌, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని దిల్‌ రాజు నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి సినిమా గురించి తెలిపారు అనిల్‌ రావిపూడి. వింటేజ్‌ మెగాస్టార్‌ని చూపించబోతున్నట్టు వెల్లడించారు.

ఈ మూవీని షైన్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై సాహో నిర్మించబోతున్నారు. వచ్చే సంక్రాంతికి దీన్ని ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారని సమాచారం. అయితే శ్రీకాంత్‌ ఓడెల సినిమా కంటే ముందే అనిల్‌ సినిమా ప్రారంభమైనా ఆశ్చర్యం లేదని టాక్‌. 

also read: జూ ఆర్టిస్ట్ లు కృష్ణంరాజుని బట్టలు చిరిగేలా కొట్టారా? అసిస్టెంట్‌ కారణం పాపం రెబల్‌ స్టార్‌కి దారుణమైన అనుభవం
 

click me!