జానీ మాస్టర్‌ ని పవన్‌ కళ్యాణ్‌, రామ్‌ చరణ్‌ దూరం పెట్టారా? కొరియోగ్రాఫర్‌ చెప్పిన నిజం ఏంటంటే?

By Aithagoni Raju  |  First Published Jan 4, 2025, 10:00 AM IST

జానీ మాస్టర్‌ కష్ట కాలంలో ఉన్నప్పుడు పవన్‌ కళ్యాణ్‌, రామ్‌ చరణ్‌ దూరం పెట్టారా? ఆయనకు కనీసం సపోర్ట్ కూడా ఇవ్వలేదా? దీనిపై జానీ మాస్టర్‌ షాకింగ్‌ విషయాలు బయటపెట్టారు.
 


స్టార్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తనని జానీ మాస్టర్‌ లైంగిక వేధింపులకు గురి చేశాడని చెప్పి తన వద్ద పనిచేసే లేడీ అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ కేసులో జానీ మాస్టర్‌ని అరెస్ట్ చేశారు. కొన్నాళ్లపాటు జైల్‌లోనూ ఉన్నారు. ఈ మధ్యనే ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. అనంతరం ఫ్యామిలీకే పరిమితమైన జానీ మాస్టర్‌ ఇటీవల బయట కనిపిస్తున్నారు. ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. 

Latest Videos

అల్లు అర్జున్‌తో వివాదంపై జానీ మాస్టర్ రియాక్షన్‌..

ఇటీవల సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ శ్రీతేజని జానీ మాస్టర్‌ పరామర్శించిన విషయం తెలిసిందే. బాబు కోలుకుంటున్నాడని, త్వరలోనే మామూలు మనిషి అవుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఈ క్రమంలో అల్లు అర్జున్‌ని కలిశారా? అనే ప్రశ్నకి తాను ఫ్యామిలీతోనే గడిపాను అని, ఇంకా ఎవరినీ కలవలేదని, తనపై కేసు కోర్ట్ లో ఉన్న నేపథ్యంలో దీనిపై తాను స్పందించలేనని తెలిపారు జానీ మాస్టర్‌. 

పవన్‌, రామ్‌ చరణ్‌ సపోర్ట్ పై జానీ మాస్టర్‌ కామెంట్‌..

తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌లో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జానీ మాస్టర్‌.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ని, హీరో రామ్‌ చరణ్‌ని ఎంతో అభిమానిస్తారు. వాళ్లని దేవుడిలా, అన్నలా చూస్తారు. మరి తాను ఇలాంటి ఆరోపణలతో జైల్లో ఉన్న నేపథ్యంలో, తాను కష్ట కాలంలో ఉన్న నేపథ్యంలో వీరి సపోర్ట్ ఎలా ఉంది? వాళ్లు సైలెంట్‌గా ఉండటానికి కారణం ఏంటి? కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని పట్టించుకోలేదా? అనే ప్రశ్న జానీ మాస్టర్‌కి ఎదురైంది.

దీనికి ఆయన స్పందించారు. తనకు వాళ్లు సపోర్ట్ చేయలేదని తెలిపారు జానీ మాస్టర్ అయితే. వాళ్లు సపోర్ట్ చేసినంత మాత్రాన వారిపై ప్రేమ, అభిమానం తగ్గదని, అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ అలానే చూస్తానని తెలిపారు జానీ మాస్టర్. 

పవన్‌, చరణ్‌ సైలెన్స్ హెల్ప్ చేసిందా?

పవన్‌ కళ్యాణ్‌, రామ్‌ చరణ్‌ సైలెన్స్ పై రియాక్ట్ అవుతూ, వాళ్లు సైలైంట్‌గా ఉండటమే తమకు హెల్ప్ చేసిందని, తానేంటో తాను నిరూపించుకోవాలని అనుకుంటున్నట్టు తెలిపారు. ఇతరుల సపోర్ట్ తో తాను క్లీన్‌గా బయటకు రావాలని అనుకోవడం లేదని,

తాను నిజంగానే తప్పు చేసి ఉంటే అందరు తప్పు చేశావని మాట్లాడేవారు, రకరకాలుగా కామెంట్‌ చేసేవారు, కానీ అలా ఎవరూ మాట్లాడలేదు, సైలెంట్‌గా ఉన్నారు, వాళ్ల సైలెన్సే నేనేంటో చెబుతుంది. ఓ రకంగా పవన్‌, చరణ్‌ సైలెన్స్ తనకు చాలా హెల్ప్ చేసిందన్నారు జానీ మాస్టర్‌. వాళ్లు సపోర్ట్ ఇస్తేనే జిందాబాద్‌ కొట్టడం, సపోర్ట్ ఇవ్వకపోతే కొట్టకపోవడం ఉండదని చెప్పారు.

ఈ విషయంలో జానీ మాస్టర్‌ భార్య కూడా ఇదే విషయాన్ని చెప్పడం విశేషం. నాగబాబు తనకు సపోర్ట్  చేశారని, ఆయనకు, తనకు సపోర్ట్ చేసిన వారందరికి రుణపడి ఉంటానని తెలిపారు జానీ మాస్టర్‌. 

also read: జూ ఎన్టీఆర్‌ ప్రస్తావన రావద్దు అంటూ బాలయ్య కండీషన్‌? అన్‌స్టాపబుల్‌ షో గెస్ట్ లకు ముందే సూచన, ఇంత పగేంటి?

పార్టీ నుంచి తొలగించడం బాధించిందిః జానీ మాస్టర్‌

ఇక జనసేన పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడంపై జానీ మాస్టర్‌ రియాక్ట్ అవుతూ, అది తనని బాధ పెట్టిందన్నారు. కానీ దీన్ని ఆసరాగా తీసుకుని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తారు, కాబట్టి పవన్‌ తీసుకున్న నిర్ణయం విషయంలోనే హ్యాపీగానే ఉన్నాను, ఆ స్థాయిలో ఎవరు ఉన్నా అలానే చేస్తారని వెల్లడించారు. పార్టీ ఆదేశాల ప్రకారం జనసేన పార్టీ పేరుని వాడను, కానీ తాను చేయాల్సిన సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాను అని చెప్పారు జానీ మాస్టర్‌.

ఇదిలా ఉంటే తనపై ఈ ఆరోపణలతో జాతీయ అవార్డుని ఉపసంహరించుకుంది కేంద్ర ప్రభుత్వం. కోలీవుడ్‌ ధనుష్‌ హీరోగా నటించిన `తిరు` సినిమాకిగానూ బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్‌కి జాతీయ అవార్డుని ప్రకటించిన విషయం తెలిసిందే.   

read more: `గ్యాంగ్‌ లీడర్‌`, `ఘరానా మొగుడు` రేంజ్‌లో.. చిరంజీవితో మూవీపై అనిల్‌ రావిపూడి అదిరిపోయే లీక్‌
 

click me!