ఈ సినిమా విడుదలకు ముందు నుండే సోషల్ మీడియాలో మంచి బజ్ ను క్రియేట్ చేయడంలో సఫలం అయ్యింది. కనుక ఈ సినిమా విడుదల కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూశారు.
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు నుంచి వచ్చిన కొత్త చిత్రం ‘అర్జున ఫల్గుణ’. ‘జోహార్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన తేజ మార్ని.. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ చిత్రాన్ని రూపొందించాడు. నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. దాంతో చాలా మంది ఈ సినిమాని ఓటీటిలో చూద్దామని ఫిక్స్ అవుతున్నారు. అయితే ఎప్పుడు ఓటీటిలో రిలీజ్ అవుతుంది..ఏ ఓటీటిలో అనేది చూద్దాం.
అర్జున ఫల్గుణ ని అమెజాన్ ఓటీటి సంస్దకి రైట్స్ ను ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. శ్రీ విష్ణు నటించిన ఈ సినిమా ను ఓటీటీ లో ఎప్పుడు స్ట్రీమింగ్ చేసే విషయమై అఫీషియల్ సమాచారం లేదు కానీ...నెల తిరక్కుండానే ఓటీటిలో కనపడచ్చు అంటున్నారు. హిట్టైన సినిమాలు ఈమద్య కాలంలో ఎక్కువ శాతం సినిమాలు థియేటర్ రిలీజ్ అయిన తర్వాత నాలుగు వారాలకు అంటే సరిగ్గా నెల రోజులు తర్వాత ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే సినిమా ఫ్లాఫ్ అయినవి రెండు వారాల్లోనే ఓటీటిల్లోకి వస్తున్నవి కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా కూడా ఖచ్చితంగా అదే తరహా లో వస్తుందని మీడియాలో అంచనాలు వేస్తున్నారు. అఫిషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రావాల్సి ఉంది.
ఇందులో శ్రీవిష్ణు జూనియర్ ఎన్టీఆర్ అభిమాని పాత్రలో కనిపించడం విశేషం. అయితే ఆ సీన్స్ కూడా డల్ అయ్యిపోయాయి. శ్రీ విష్ణు నటుడిగా తన వంతు ప్రయత్నం చేసినా.. అర్జున్ పాత్రను నిలబెట్టలేకపోయాడు. అతడి ఇమేజ్ కు భిన్నంగా అర్జున్ పాత్రకు విపరీతమైన బిల్డప్.. ఎలివేషన్ ఇవ్వాలని చూడటం బెడిసికొట్టింది. ప్రోమోలు చూస్తే మంచి కంటెంట్ ఉన్న సినిమాలాగే కనిపించింది.ఎన్టీఆర్ ఫ్యాన్స్, గ్రామ వాలంటీరు ఉద్యోగాలు, ప్రెసిడెంట్ మెడల్ మందు పై సెటైర్లు .. పెద్దగా ఆకట్టుకోలేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాకు అండగా ఉంటారనుకుంటే అదీ జరగలేదు. దానికి తోడు వైసీపీ అభిమానులు ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఓ రేంజిలో ఆడేసుకున్నారు. రిలీజ్ అయ్యాక మరీ పెరిగిపోయింది.
అమృత అయ్యర్ చాలా సాధారణంగా కనిపించింది. ఆ పాత్ర కూడా చాలా పేలవం. నరేష్ అందరిలోకి కొంత ప్రత్యేకంగా కనిపించాడు. చాన్నాళ్ల తర్వాత కీలకమైన విలన్ పాత్ర చేసిన సుబ్బరాజు కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు.