Jayasudha: జయసుధ షాకింగ్‌ మేకోవర్‌.. యంగ్‌ లుక్‌ మైండ్‌ బ్లాక్‌..

Published : Nov 27, 2021, 01:07 PM IST
Jayasudha: జయసుధ షాకింగ్‌ మేకోవర్‌.. యంగ్‌ లుక్‌ మైండ్‌ బ్లాక్‌..

సారాంశం

సీనియర్‌ నటి జయసుధ అభిమానులకు షాకిస్తుంది. కొత్త లుక్‌లో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతం ఆమె లేటెస్ట్ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

సీనియర్‌ నటి జయసుధ లేటెస్ట్ లుక్‌ అభిమానులకు షాకిస్తుంది. ఊహించని విధంగా ఆమె మారిపోయింది. బాగా స్లిమ్‌గానూ మారిపోయింది. గతంలో ఓ సందర్భంగా నడిసిన(తెల్లని) జుట్టుతో కనిపించి షాక్‌కి గురి చేసిన జయసుధ ఇప్పుడు మరో కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. ఆమె బరువు తగ్గి కాస్త స్లిమ్‌ అయ్యారు. లేటెస్ట్ లుక్‌కి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 62ఏళ్ల జయసుధ బరువు తగ్గడంతో యంగ్‌గా కనిపిస్తున్నారు. నెటిజన్లని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. 

ఇందులో జయసుధ బ్యాక్‌ బ్లేజర్‌, బ్లాక్‌ క్యాప్‌ ధరించి నవ్వుతూ సెల్ఫీ దిగింది. స్పెషల్‌ డైట్‌ ఫాలో అవుతూ ఆమె ఇలా బరువు తగ్గినట్టు తెలుస్తుంది. కొత్త లుక్‌లో మాత్రం జయసుధ అదరగొడుతుందని చెప్పొచ్చు. సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన జయసుధ మళ్లీ ఇప్పుడు కమ్‌ బ్యాక్‌ కాబోతున్నట్టు తెలుస్తుంది. లేటెస్ట్ మేకోవర్‌ అందులో భాగంగానే చేసిందని అంటున్నారు. కొత్త ఛాలెంజెస్‌తో కొత్త పాత్రలు చేసేందుకు తాను సిద్దమవుతుందని సమాచారం. 

జయసుధ ఇటీవల కాలంలో `శతమానం భవతి`, `శ్రీనివాస కళ్యాణం`,`మహర్షి` చిత్రాల్లో కనిపించింది. చివరగా ఆమె రెండేళ్ల క్రితం వచ్చిన `రూలర్‌` చిత్రంలో నటించారు. యంగ్‌ హీరోలకు జయసుధ బెస్ట్ ఆప్షన్‌ అవుతున్నారు. అయితే మధ్యలో కాస్త గ్యాప్‌ తీసుకున్న ఆమె మళ్లీ కమ్‌ బ్యాక్‌ కాబోతుందని సమాచారం. 

ఒకప్పుడు చాలా అందంగా ఉండి తన అభినయంతో కుర్రకారు గుండెల్లో కలల రాకుమారిగా మారిపోయింది జయసుధ.చాలా మంది హీరోల పక్కన తనదైన నటనతో నటించి మెప్పించింది రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన జ్యోతి సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె నటనను నచ్చిన సినీ జనాలు ఆమెకి సహజనటి అనే బిరుదు కూడా ఇచ్చారు. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత ఆవిడ అమ్మ పాత్రలు చేయడం స్టార్ట్ చేశారు. అలా ఆవిడ చేసిన పాత్రల్లో రవితేజ హీరోగా పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన `అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి` సినిమాలో ఆమె నటన చాలా అద్భుతంగా ఉంటుంది.

చాలా సినిమాల్లో ఆమె హీరోలకు తల్లి పాత్రలు చేశారు. ముఖ్యంగా దిల్ రాజు బ్యానర్ లో భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన బొమ్మరిల్లు సినిమా లో సిద్ధార్థ తల్లిగా నటించి మంచి మార్కులు కొట్టేశారు. అలాగే శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో వచ్చిన `కొత్త బంగారులోకం` సినిమాలో తండ్రిని కోల్పోయిన కొడుకుకి ధైర్యం ఇచ్చే తల్లిగా ఒక మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలాగే కృష్ణవంశీ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన `గోవిందుడు అందరివాడేలే` సినిమా లో రాంచరణ్ వాళ్ళ నానమ్మ గా నటించి మంచి పేరు సంపాదించింది. `శతమానం భవతి` చిత్రంలో సైతం నాన్నమ్మగా అదరగొట్టింది జయసుధ.

also read: Pragya Jaiswal: `మీరు మనిషేనా?`.. బాలయ్యని పట్టుకుని అంత మాట అనేసిందేంటి?

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు