
టాలీవుడ్ అగ్ర హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి, బాలకృష్ణకి మధ్య కొన్నేళ్ల పాటు రిలేషన్ సరిగ్గా లేదనే సంగతి తెలిసిందే. హరికృష్ణ మరణం తరువాత మరోసారి బాలకృష్ణ.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు దగ్గరయ్యాడు.
ఈ క్రమంలో ఓ పెళ్లి వేడుకలో ఎన్టీఆర్.. జై బాలయ్య, జై బాలయ్య అంటూ అరవడం హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి ఆదివారం రాత్రి ఎంతో ఘనంగా జరిగింది. ముందు రోజు సంగీత్ కార్యక్రమంలో అఖిల్ ముందుగా జై బాలయ్య అంటూ అరిచాడు.
దీంతో మిగతా వారు కూడా జై జై బాలయ్య అంటూ అరిచారు. పక్కనే ఉన్న ఎన్టీఆర్ కూడా అదే స్లోగన్ అందుకొని ఓ రేంజ్ లో అరిచాడు. దీంతో అక్కడి వాతావరణం మొత్తం సందడిగా మారింది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ పెళ్లి వేడుకలో అక్కినేని నాగార్జున, అఖిల్, ప్రభాస్, రామ్ చరణ్, రానా, ఎన్టీఆర్, నాని, అనుష్క ఇలా చాలా మంది సినీ తారలు పాల్గొన్నారు.
రాజమౌళి కొడుకు పెళ్లిలో తారక్ రచ్చ చూశారా..?
రాజమౌళి, రామ్ చరణ్ డాన్స్ చూశారా..?
పెళ్లి సందడి అంతా ప్రభాస్, అనుష్కలదే!
రాజమౌళి కొడుకు పెళ్లి.. అతిథులు వీళ్లే..!
రాజమౌళి కొడుకు పెళ్లి.. చరణ్, ఎన్టీఆర్ వాలిపోయారు!