Guppedantha Manasu: వసుని ఎప్పటికీ క్షమించలేవా అంటూ జగతి ప్రశ్న.. రిషికీ పెట్టిన మెసేజ్ డిలీట్ చేసిన వసుధార!

Published : Mar 06, 2023, 07:22 AM IST
Guppedantha Manasu: వసుని ఎప్పటికీ క్షమించలేవా అంటూ జగతి ప్రశ్న.. రిషికీ పెట్టిన మెసేజ్ డిలీట్ చేసిన వసుధార!

సారాంశం

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్  కొనసాగుతుంది. ఇక ఈరోజు మార్చి 6వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

ఈరోజు ఎపిసోడ్ లో జగతి రిషి తో మాట్లాడుతూ ఆరోజు నీ అనుమతి తీసుకునే నేను ఆ తాళిబొట్టు పంపించలేదు. నిజానికి అందులో ఏముందో నేను చెప్పలేదు నువ్వు కూడా చూడలేదు. అనుమతి లేకుండానే నీ పేరు కూడా చెప్పాను అనగా రిషి ఒక్కొకటిగా అన్ని తలుచుకుంటూ ఉంటాడు. వసుధార కూడా ఆవేదనతోను ఆవేశంతోనో తనకు తోచినది చేసింది. తాళిబొట్టు మెడలో వేసుకుంది ఎక్కడ కూడా నీ అనుమతి లేదు అంటుంది జగతి. అప్పుడు రిషి మేడం మీరు నా పేరు చెప్పినందుకు తప్పు పట్టడం లేదు కానీ వసుధార చేసింది నా మనసుకు నచ్చడం లేదు మేడం అని అంటాడు. తనంతట తాను మెడలో తాళివేసుకోవడం కరెక్ట్ కాదు కదా అని అంటాడు రిషి.

ఏంటి మేడం తను చేసిన తప్పుని మీరు సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారా అని అడుగుతాడు రిషి. నేను తప్పు చేసి ఉంటే అనగా మీరేం తప్పు చేయలేదు చేసి ఉంటే అక్కడే నేను కాదు అని చెప్పే వాడిని కదా అని అంటాడు రిషి. మీరు అక్కడ చేసింది రైటే నమ్ముతున్నాను కానీ గతంలో మీరు నా విషయంలో చేసినవన్నీ రైట్ ఏ అని నేను నమ్మడం లేదు అనడంతో జగతి బాధపడుతూ ఉంటుంది. వసుధారని ఎప్పటికీ క్షమించలేవా రిషి అని అడగగా ఈ ప్రశ్నకి నా దగ్గర ప్రస్తుతానికి సమాధానం లేదు మేడం అని అంటాడు. కొందరు అన్నింటిని తట్టుకుంటారు మరికొందరు తట్టుకోలేరు కదా వసుధార కి నాలాంటి పరిస్థితి రాకూడదు రిషి అని ఎమోషనల్ గా మాట్లాడుతుంది జగతి.

 అప్పుడు రిషి షాక్ అయ్యి అక్కడ నుంచి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. మరొకవైపు వసుధార చక్రపాణి నిద్రపోతుంటే దుప్పటి కప్పి బయటకు వెళ్తుంది. ఇదేంటి నేను డోర్ వేయడం మరిచిపోయానా అని డోర్ దగ్గరికి వెళ్ళగా ఇంతలో అక్కడికి రిషి రావడంతో ఒకసారిగా ఆశ్చర్యపోతుంది. తర్వాత వసుధార, రిషి ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. తలనొప్పిగా ఉంది సార్ నీ చేత్తో కాఫీ తాగాలని వచ్చాను అనడంతో ఇప్పుడే వస్తాను సార్ అని వసుధార లోపలికి వెళ్లి కాఫీ తీసుకొని వస్తుంది. ఏదైనా మాట్లాడండి సార్ అనడంతో నువ్వే మాట్లాడు అని అంటాడు రిషి. నాకు పొగరు గర్వము అహంకారం ఇవన్నీ ఉన్నాయి ఏమో కానీ మీ ముందు కాదు సార్ అని అంటుంది.

ఒక్కసారి ఆలోచించండి సార్ అప్పుడున్న పరిస్థితులలో నాకు అదే మార్గంలో కనిపించింది అని అంటుంది. మీరే నన్ను సరిగా అర్థం చేసుకోవడం లేదు సార్ అని అంటుంది. అప్పుడు రిషి వెళ్ళొస్తాను అనగా సర్ నాతో ఏదో మాట్లాడాలని వచ్చారు మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు అనగా వెంటనే రిషి జగతి అన్న మాటలు తలుచుకొని వసుధారనీ హత్తుకుంటాడు. అప్పుడు వసుధార ఒకసారిగా షాక్ అవుతుంది. ఇదే మన బంధం ఇదే మన దూరం అని చెప్పి అక్కడి నుంచి మాట్లాడకుండా వెళ్ళిపోతాడు రిషి. పరసటి రోజు ఉదయం రిషి కాలేజీకి వెళ్తాడు. ఇప్పుడు రిషి కారుకి స్టూడెంట్స్ అందరూ అడ్డుగా వచ్చి నిలబడతాడు. అప్పుడు రిషి కారు దిగగానే వసుధర రిషి కలిపి ఉన్న ఫోటోలు ఫ్లవర్స్ పట్టుకొని కంగ్రాట్యులేషన్స్ సార్ అని చెప్పడంతో అది చూసి రిషి,మహేంద్ర,జగతి లు షాక్ అవుతారు. 

అప్పుడు రిషి ఏంటి ఇదంతా అనగా మహేంద్ర నిన్నటి ప్రభావం రిషి అనడంతో మీ అభిమానానికి థాంక్స్ అని జగతి అనగా రిషి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు వసు రిషితో గడిపిన క్షణాలు రిషికి ఇచ్చిన కానుకలు అన్నీ చూసి సంతోషంగా వాటిని చూసి మురిసిపోతూ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంతలోనే మినిస్టర్ పిఏ ఫోన్ చేసి మిమ్మల్ని మినిస్టర్ గారు రమ్మంటున్నారు అనడంతో సరే అని అంటుంది వసుధార. మరోవైపు రిషి వసుధార ఏంటి ఇంకా రాలేదు అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వసుధరా నేను కాలేజీకి రావడం లేదు సార్ అని మెసేజ్ చేసి చూడక ముందు దాన్ని డిలీట్ చేస్తుంది. పొగరు ఏంటో అసలు అర్థం కాదు అనుకుంటూ ఉంటాడు రిషి. ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత రిషికి మినిస్టర్ ఫోన్ చేసి కంగ్రాట్యులేషన్స్ చెప్పాడు.

PREV
click me!

Recommended Stories

సీజన్ 9లో భరణి అన్ అఫీషియల్ విన్నర్, నాగబాబు రెకమండేషన్ ఇలా వర్కౌట్ అయిందా.. మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్
Karthika Deepam 2 Latest Episode: దీపను బ్రతిమాలిన శ్రీధర్- స్వప్న, కాశీలను కలిపిన కార్తీక్