ఎన్టీఆర్‌30 అప్‌డేట్‌.. ఫ్యాన్స్ కోరిక ఫలించింది.. జాన్వీ కపూర్‌ని ఫైనల్‌ చేస్తూ బర్త్ డే సర్‌ప్రైజ్‌?

Published : Mar 05, 2023, 10:39 PM ISTUpdated : Mar 05, 2023, 10:41 PM IST
ఎన్టీఆర్‌30 అప్‌డేట్‌.. ఫ్యాన్స్ కోరిక ఫలించింది.. జాన్వీ కపూర్‌ని ఫైనల్‌ చేస్తూ బర్త్ డే సర్‌ప్రైజ్‌?

సారాంశం

ఎన్టీఆర్‌ నటించబోతున్న కొరటాల శివ చిత్రానికి సంబంధించి షూటింగ్‌, హీరోయిన్ ఎవరనే అప్‌ డేట్లు చాలా కాలంగా సస్పెన్స్ నెలకొన్నాయి. రేపు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేసింది యూనిట్‌.

ఎన్టీఆర్‌ అభిమానుల కోరిక ఫలించబోతుంది. ఏడాది కాలంగా వెయిట్‌ చేస్తున్న సినిమా అప్‌ డేట్‌ రాబోతుంది. ఎట్టకేలకు `ఎన్టీఆర్‌30` కి సంబంధించిన అదిరిపోయే అప్‌ డేట్‌ ఇవ్వబోతుంది. ఈ సినిమా షూటింగ్‌ గత నెలలోనే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ తారకరత్న హఠాన్మరణంతో వాయిదా వేశారు. ఇప్పుడు షూటింగ్‌ కి సంబంధించిన అప్‌ డేట్‌ ఇవ్వబోతుంది యూనిట్‌. తాజాగా ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది ఎన్టీఆర్‌ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్. ఈ సినిమాని ఎన్టీఆర్‌ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. 

ఇదిలా ఉంటే షూటింగ్‌ డిటెయిల్సే కాదు, అంతకు మించిన అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతుంది యూనిట్‌. రేపు `ఎన్టీఆర్‌ 30`లో నటించే హీరోయిన్‌ ఎవరో వెల్లడించబోతున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ హీరోయిన్‌ బర్త్ డే సందర్భంగానే ఈ అప్‌ డేట్‌ ఇవ్వబోతుండటం విశేషం. ఆమెనే జాన్వీ కపూర్‌. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి జోడీగా జాన్వీ కపూర్‌ ఫైనల్‌ అయినట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని రేపు సోమవారం(మార్చి 6)న కన్ఫమ్‌ చేయబోతుందట యూనిట్. అలా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కి రెండు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనుంది టీమ్‌. మరి ఇదేనా? ఇంకేమైనా అప్‌డేట్లు ఉంటాయా? అనేది చూడాలి. 

కానీ తాజాగా నిర్మాణ సంస్థ ఇచ్చిన అప్‌ డేట్‌ ట్వీట్‌తో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇప్పుడు `ఎన్టీఆర్‌30` యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతుండటం విశేషం. ఇక కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమాలో యాక్షన్‌ ప్రధానంగా సాగబోతుంది. వాటర్‌ నేపథ్యంలో పూర్తి రా, రస్టిక్‌ యాక్షన్ మూవీగా రూపొందించబోతున్నారు దర్శకుడు కొరటాల శివ. ఆయన గత చిత్రం `ఆచార్య` ఘోరంగా పరాజయం చెందింది. తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. వాటన్నటికీ `ఎన్టీఆర్‌30`తో సమాధానం చెప్పాలని భావిస్తున్నారు కొరటాల. అందుకోసం ఈ స్క్రిప్ట్ ని ఫైనల్‌ చేసేందుకు ఏడాది టైమ్‌ తీసుకున్నారు. అంతేకాదు సినిమా స్కేల్‌ని కూడా పెంచారు. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. అనిరుథ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

నన్ను చూసి ఉలిక్కిపడి చస్తుంటారు, అఖండ 2 బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో బాలకృష్ణ ఆవేశం..6వ హిట్ రాబోతోంది
Illu Illalu Pillalu Today Episode Dec 15: తాగేసి రచ్చ రచ్చ చేసిన వల్లీ, ఇచ్చిపడేసిన ప్రేమ