ముగిసిన ముమైత్ ఖాన్ సిట్ విచారణ

First Published Jul 27, 2017, 4:45 PM IST
Highlights
  • డ్రగ్స్ కేసులో ముగిసిన ఐటమ్ బాంబ్ ముమైత్ ఖాన్ విచారణ
  • ఉదయం 9.45 గంటలకు విచారణకు హాజరైన ముమైత్ ఖాన్
  • సాయంత్రం 4.45కే ముమైత్ విచారణ ముగించిన సిట్ అధికారులు
  • ఆరు గంటల పాటు కెల్విన్ తో ముమైత్ కు, టాలీవుడ్ కున్న లింక్స్ పై సిట్ ఆరా

డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న ఐటమ్ బాంబ్ ముమైత్ ఖాన్ సిట్ విచారణ ముగిసింది. ఉదయం 9.45 నిమిషాలకే సిట్ కార్యాలయానికి చేరుకుంది ముమైత్ ఖాన్ వెంట కారులో సిట్ ఆఫీస్ వరకు బిగ్ బాస్ నిర్వాహకులు వచ్చారు. ఇక సిట్ విచారణలో ముమైత్ మరింత సమాచారం వెల్లడించిందని సమాచారం. ప్రధానంగా పూరీ జగన్నాథ్ తో డ్రగ్స్ గ్యాంగ్స్ కు వున్న లింక్స్, కెల్విన్ తో వున్న సంబంధాలపైనే కాక మరిన్ని అంశాలపై సిట్ సమాచారం సేకరించిందని సమాచారం.

 

అంతే కాక తరచూ ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి వెళ్తుండటంపై ముమైత్ ను సిట్ అధికారులు ప్రశ్నించారు. ప్రస్థుతం బిగ్ బాస్ హౌజ్ లో పార్టిసిపెంట్ గా వున్న ముమైత్ ప్రత్యేక అనుమతితో సిట్ విచారణకు హాజరైంది. అయితే విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే ముమైత్ వెళ్లిపోయింది. ఇక రేపు ఎవరు విచారణకు హాజరవుతారనే అంశంపై సిట్ అధికారులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం వుంది.

 

ఇక ముమైత్ ఖాన్ విచారణకు హాజరైన తీరు చూస్తే.. నిన్న చార్మి విచారణకు హాజరైన సందర్భంలో నెలకొన్ని గందరగోళం తరహాలో ఎలాంటి పోలీసు హడావుడి లేకుండా.. చాలా కూల్ గా కారు దిగిన కాడ్నుంచి... సిట్ ఆఫీస్ కు వెళ్లే వరకు ఎలాంటి పోలీసు డిస్ట్రబెన్స్ లేకుండా చాలా కూల్ గా విచారణకు వెళ్లింది. నలుగురు మహిళా పోలీసులు వెంట వెళ్లగా.. చాలా కూల్ గా ఎవరి హరాస్ మెంట్ లేకుండా సిట్ రూమ్ కు వెళ్లింది. విచారణ గదిలో సిట్ అధికారి పవన్ కుమార్ నేతృత్వంలో నలుగురు మహిళా అధికారులు ముమైత్ ను విచారించారు. మొత్తానికి హీరోయిన్ చార్మి పిటిషన్, తన పట్ల కానిస్టేబుల్స్ అసభ్యంగా ప్రవర్తించారని ఇచ్చిన కంప్లయింట్ ముమైత్ కు ఇబ్బంది లేకుండా చేసింది. విచారణలో ఎలాంటి వివరాలు వెల్లడించిందనేది వెల్లడి కావాల్సి వుంది.

ప్రధానంగా డ్రగ్స్ గ్యాంగ్ లతో సినిమా వాళ్ల సంబంధాలు, పూరీతో కెల్విన్ సంబంధాలపై పూరీ గ్యాంగ్ మెంబర్ ముమైత్ ను సిట్ విచారించిందని తెలుస్తోంది. మొత్తానికి గత ఎనిమిది రోజులుగా టాలీవుడ్ ప్రముఖులను విచారిస్తున్న సిట్ తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనకు కంకణం కట్టుకుందని స్పష్టమవుతోంది.

click me!