స్టార్ మాకు "బిగ్ బాస్" ఎఫెక్ట్.. టీ.ఆర్.పీ రేటింగ్స్ లో టాప్

Published : Jul 27, 2017, 02:14 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
స్టార్ మాకు "బిగ్ బాస్" ఎఫెక్ట్..  టీ.ఆర్.పీ రేటింగ్స్ లో టాప్

సారాంశం

స్టార్ మా ఛానెల్ బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోకు విశేష ఆదరణ అన్ని కార్యక్రమాలను మించి రేటింగ్ సాధించిన బిగ్ బాస్

ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్స్ మధ్య టీఆర్పీ రేటింగ్స్ కాంపిటిషన్ ఏ రేంజ్ లో పెరిగిందో తెలిసిందే. రేటుంగుల కోసం వెండితెర స్టార్స్ ను రకరకాల ప్రోగ్రామ్స్ తో బుల్లి తెరపైకి తీసుకొచ్చి మరీ పోటీ పడుతున్నాయి ఛానెల్స్. ప్రస్థుతం స్టార్ మా ఛానెల్ నిర్వహిస్తున్న బిగ్ బాస్ షో గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు లాంటి కార్యక్రమాలతో అలరించిన మాటీవీ చిరంజీవి, నాగార్జున లాంటి బడా హీరోలను రంగంలోకి దించింది. తాజాగా ఎన్టీఆర్ ను రంగంలోకకి దించి స్టార్ మా సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది. ఇక యంగ్ హీరోస్ లో ఒకరైన రానా కూడా నెంబర్ 1 యారి కార్యక్రమంతో అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎన్టీఆర్ బిగ్ బాస్ షో మాత్రం ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. రేటింగుల పరంపరలో కొత్త అధ్యాయం లిఖిస్తోంది.

 

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా..14 మంది కంటెస్టంట్స్ తో..   భారీగా ప్లాన్ చేసిన రియాలిటీ షో బిగ్ బాస్. లాంచ్ తర్వాత తొలుత బిగ్ బాస్ ప్రేక్షకుల నుండి మిక్సెడ్ రెస్పాన్స్ అందుకుంది. షో మొదలైన తారు అందరిని ఉత్సాహంలో నింపగా ఆ తర్వాత హౌజ్ మెట్స్ మధ్య అంతా సాన్నిహిత్యం లేకపోవడంతో మొదటి వారం నీరసంగా సాగింది.  

 

వారం ముగిసి తారక్ వచ్చే సరికి మళ్లీ ప్రోగ్రాం మీద ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. అప్పటిదాకా నీరసంగా సాగుతున్న షో కాస్త జోష్ ఫుల్ గా మారింది. ఇక కంటెస్టంట్స్ మధ్య గొడవలు ఎలా ఉన్నా రియాలిటీ షో అంటే ఆ రేంజ్ కు తగ్గట్టే చేస్తున్నారు. ఇక ఈరోజు వచ్చిన టి.ఆర్.పి రేటింగ్స్ లో స్టార్ మా ను మొదటి స్థానంలో నిలబెట్టింది బిగ్ బాస్.

 

బిగ్ బాస్ షోకి అత్యధికంగా 16.18 టి.ఆర్.పి రేటింగ్స్ రావడం విశేషం. మా టివి కాస్త స్టార్ మా అయిన తర్వాత 2017లో ఈ రేంజ్ టి.ఆర్.పి అందుకోవడం ఇదే మొదటిసారి. సో ఈ లెక్కన చూస్తే తారక్ బిగ్ బాస్ సూపర్ హిట్ అన్నట్టే లెక్క. కేవలం సినిమాల్లోనే కాదు బుల్లితెర మీద కూడా తారక్ ఇచ్చిన పాత్రకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేస్తాడు అన్న విషయం బిగ్ బాస్ చూస్తే అర్ధమవుతుంది. ఈ రేటింగ్ ఇచ్చిన ఉత్సాహం చూస్తుంటే స్టార్ మా ఇలాంటి క్రేజీ రియాలిటీ షోస్ ను ఇంకా మరిన్ని ఆడియెన్స్ కోసం తెచ్చే ప్రయత్నిస్తారని చెప్పొచ్చు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా