మా బ్రాండ్ వేల్యూ పెంచేలా ఇంకేంటి నువ్వే చెప్పు-నిర్మాత మళ్ళ విజయ ప్రసాద్

Published : Dec 11, 2016, 01:35 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
మా బ్రాండ్ వేల్యూ పెంచేలా ఇంకేంటి నువ్వే చెప్పు-నిర్మాత మళ్ళ విజయ ప్రసాద్

సారాంశం

విశాఖ ఆర్కే బీచ్ లో ఘనంగా 'ఇంకేంటి నువ్వే చెప్పు' మూవీ ఆడియో వెల్ఫేర్ క్రియేషన్స్ బ్యానర్ పై మళ్ల విజయ ప్రసాద్ నిర్మించిన మూవీ ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సుమ‌న్ మాట్లాడుతూ, విశాఖ సాగర తీరాన ఇలా ఈ కార్య‌క్ర‌మం నిర్వహించ‌డం, చాలా సంతోషంగా ఉంద‌ని.. సినిమా కోసం పని చేసిన ప్ర‌తీ ఒక్క‌రికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. 

 

ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర రెడ్డి మాట్లాడుతూ, నిర్మాత విజ‌య్ ప్ర‌సాద్ నాకు బాగా తెలుసు. ఆయ‌న ప్రేక్ష‌కుల‌కు అందించిన సినిమాలన్నీ ఎంతో పెద్ద విజయాన్ని సాధించాయి. ఈ చిత్రం కూడా అలాంటి విజ‌యాన్ని సాధించాల‌ని ఆశిస్తున్నా అన్నారు. 

 

హీరోయిన్ అక్ఛిత  మాట్లాడుతూ, త‌న‌తో ప‌నిచేసిన న‌టీన‌టుల‌కు, త‌న‌కు ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థ్యాంక్స్ చెప్పారు. 

 

హీరో సన్ని మాట్లాడుతూ, ఈ సినిమా త‌ప్ప‌కుండా త‌న‌కు మంచి భ‌విష్య‌త్ ను ఇస్తుంద‌ని, త‌న‌కు అవ‌కాశ‌మిచ్చిన వారికి ధన్య‌వాదాలు తెలిపారు. వికాస్ అందించిన సంగీతం ఈ సినిమాకు కీల‌క‌మ‌ని చెప్పారు. 

 

మ‌రో హీరో ప్ర‌శాంత్ మాట్లాడుతూ, వెల్ఫేర్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో వ‌చ్చిన అన్ని సినిమాల లాగానే ఈ సినిమా కూడా ఉంటుంద‌న్నారు. సాగ‌ర్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ అవుతుంద‌న్నారు.

 

హీరోయిన్ ప్ర‌స‌న్న మాట్లాడుతూ, వైజాగ్ లో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. త‌న‌కు వైజాగ్ అంటే ఎంతో ఇష్ట‌మ‌ని, త‌న‌కు ప్ర‌తీ ఒక్క న‌టీన‌టులు స‌హ‌కరించార‌ని చెప్పారు.

 

సహ నిర్మాత విధ్యార్థి వెoకట్రావ్ మాట్లాడుతూ, ఈ సినిమా కు ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలంటే, రైల్వే కృష్ణ గారికి చెప్పాలి.ఆయ‌న ఈ చిత్రం కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు. ఈ సినిమా కోసం ప‌ని చేసిన ప్ర‌తీ ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు అన్నారు.

 

 

డైర‌క్ట‌ర్ శివశ్రి మాట్లాడుతూ, ప్రొడ్యూస‌ర్ ఈ సినిమాకు కావాల్సిన ప్ర‌తీ దాన్ని చాలా చ‌క్క‌గా స‌మ‌కూర్చారు. ఆయ‌న ప్ర‌తీ ఒక్క‌రికీ బంధువు. సినిమాకు ప‌నిచేసిన‌ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులంద‌రూ ఎంతో కష్ట‌ప‌డ్డారు.ఇప్ప‌టి వ‌ర‌కు నా షార్ట్ ఫిల్మ్స్ ను ఆద‌రించిన ప్ర‌తీ ఒక్క‌రికీ స్పెషల్ థ్యాంక్స్ అన్నారు.

 

సంగీత ద‌ర్శ‌కుడు వికాస్ మాట్లాడుతూ, త‌నకు ఈ అవ‌కాశాన్ని ఇచ్చిన వెల్ఫేర్ క్రియేష‌న్స్ కు ఎంతో ఋణ‌ప‌డి ఉంటాన్నారు. ఆడియో ను ఇంత బాగా ఆద‌రించినందుకు సంతోష‌మ‌న్నారు. సినిమా యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

 

నిర్మాత మ‌ళ్ల విజ‌య‌ప్ర‌సాద్ మాట్లాడుతూ, మంచి సినిమాల‌ను నిర్మించేదిగా పేరున్న త‌మ బ్యాన‌ర్ విలువ త‌గ్గ‌కుండా ఈ సినిమా ఉంటుందన్నారు. ఆడియో లాగానే ఈ సినిమా ను కూడా ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నామ‌న్నారు. సినిమా మొద‌లు పెట్టిన ద‌గ్గ‌రి నుంచి ఏ ఒక్క రోజు కూడా ఆల‌స్యం కాకుండా ప్ర‌తీ ఒక్క‌రూ ఎంతో క‌ష్ట‌ప‌డి చేశారు. ఈ సినిమా త్వరలొనే  ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. పెద్ద సినిమాలు ఉన్న‌ప్ప‌టికీ, ఈ సినిమా మీద న‌మ్మ‌కంతో ఈనెలలొనే సినిమాను ముందుకు తీసుకొస్తున్నాం..సినిమా సందేశాత్మ‌కంగా ఉంటుంది.వికాస్ అందించిన సంగీతం సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్తుంది. సినిమాను ఒక‌సారి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపించేలా ఉంటుందిఅన్నారు. . 

 

 కార్య‌క్ర‌మంలో హీరో హీరోయిన్స్ వెల్ఫేర్ గ్రూప్ ఆప్ కంపెనీస్ ఎగ్జిక్యూటివ్ డైర‌క్ట‌ర్ మ‌ళ్ల అరుణ కుమారి, అలేఖ్య‌, ఆళ్ల శ్రీనివాస్,లైన్ ప్రొడ్యుసర్ అజయ్ వర్మ‌, ర‌మేష్, శేషుల‌తో పాటూ సినిమాకు ప‌ని చేసిన సాంకేతిక వ‌ర్గం, న‌టీన‌టులు పాల్గొన్నారు. కార్య‌క్ర‌మంలో ప‌లు సాంకేతిక, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు వైజాగ్ వాసుల‌ను ఎంతో ఆక‌ట్టుకున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Christmas Movies: క్రిస్మస్‌ కానుకగా విడుదలయ్యే సినిమాలివే.. కుర్రాళ్లతో శివాజీ ఫైట్‌.. ఒకే రోజు ఏడు సినిమాలు
అమ్మాయిల దుస్తులపై శివాజీ వల్గర్ కామెంట్స్...చిన్మయి, అనసూయ స్ట్రాంగ్ కౌంటర్