కోటిలింగాలలో గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ రిలీజ్

Published : Dec 11, 2016, 10:47 AM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
కోటిలింగాలలో గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ రిలీజ్

సారాంశం

కరీంనగర్ కోటిలింగాలలో గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ లాంచ్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరుకానున్న బాలకృష్ణ రిమోట్ ద్వారా ఒకేసారి వంద థియేటర్లలో ట్రయలర్ ప్లే   

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి. దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా ట్రయలర్ ను డిసెంబర్ 16న కరీంనగర్ జిల్లాలోని చారిత్రక ప్రాంతం కోటిలింగాలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.

ఈనెలల 9నే రిలీజ్ చేయాల్సిఉన్నా కొన్ని కారణాలతో ట్రయలర్ లాంచ్ నిలిపివేశారు. అయితే ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని చారిత్రక ప్రాముఖ్యత కలిగిన కోటిలింగాలలో నిర్వహించాలని నిర్ణయుంచారట.

ఇక నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రం కావడంతో ఈ ట్రయలర్ రిలీజ్ కాగానే తెలుగు రాష్ట్రాల్లోని వంద థియేటర్లలో మార్మోగిపోనుంది. బాలకృష్ణ వందో చిత్రంగా వస్తున్న గౌతమిపుత్ర ట్రైలర్ ఒక్క బటన్ తో రిమోట్ సిస్టమ్ ద్వారా ఒకేసారి వంద సార్లు ప్లే అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

కోటిలింగాలలో ఈ ట్రయలర్ లాంచ్ చేయటానికి ఎంతో ప్రత్యేకత ఉంది. గోదావరి నది ఒడ్డున ఉన్న కోటిలింగాల శాతవాహనుల సామ్రాజ్యంలో మొట్టమొదటి రాజధాని. శాతవాహనుల కాలంనాటి కోటేశ్వర, సిద్ధేశ్వరాలయాలు బయటపడ్డ ఈ ప్రాంతం శాతవాహనుల కాలంలో ఎంతో ప్రత్యేకత కలిగింది..

ఈ ప్రాంతంలో ట్రయలర్ లాంచ్ చేయడం ద్వారా గౌతమి పుత్ర శాతకర్ణికి ఎంతో గౌరవించుకున్నట్లవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

మరోవైపు ఈనెల 16న తిరుపతిలో జరగాల్సిన ఈ చిత్రం ఆడియో వేడుక వాయిదా పడింది.

PREV
click me!

Recommended Stories

Emmanuel కి బిగ్‌ బాస్‌ తెలుగు 9 ట్రోఫీ మిస్‌ కావడానికి కారణం ఇదే.. చేసిన మిస్టేక్‌ ఏంటంటే?
Christmas Movies: క్రిస్మస్‌ కానుకగా విడుదలయ్యే సినిమాలివే.. కుర్రాళ్లతో శివాజీ ఫైట్‌.. ఒకే రోజు ఏడు సినిమాలు