యూఎస్ఏలో పెరుగుతున్న ధృవ కలెక్షన్స్ గ్రాఫ్

Published : Dec 11, 2016, 01:02 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
యూఎస్ఏలో పెరుగుతున్న ధృవ కలెక్షన్స్ గ్రాఫ్

సారాంశం

యూఎస్ లో దూసుకుపోతున్న ధృవ సక్సెస్ టూర్ పేరుతో రామ్ చరణ్ యూఎస్ పర్యటన రామ్ చరణ్ కు అత్యధిక గ్రాస్ ఇచ్చిన మూవీగా ధృవ మిలియన్ మార్క్ దాటే దిశగా అడుగులేస్తున్న ధృవ

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ధృవ సినిమా పాజిటివ్ టాక్ తో మెరుగైన కలెక్షన్స్ సాధిస్తోంది. రిలీజైన రెండు రోజుల్లోనే ధృవ యూఎస్ఎలో జనతా గ్యారేజ్ సాధించిన కలెక్షన్స్ కన్నా మెరుగ్గా వసూళ్లు సాధించింది.

రామ్ చరణ్ ఇటీవల నటించిన చిత్రాలన్నింటిలో ధృవ భిన్నమైనదనే చెప్పాలి. దీంతో యూఎస్ ప్రేక్షకులు సినిమాని బాగానే ఆదరిస్తున్నారు. ఇప్పటికే మిలియన్ డాలర్ మార్క్ కు అతి సమీపంలో ఉన్న ధృవ ట్రెండ్ ఇలానే కొనసాగితే 1.5 మిలియన్ డాలర్లు సాధించడం ఖాయం.

ఇప్పటికే ధృవ టీమ్ అమెరికాలోని న్యూయార్క్, మిచిగన్ లలో పర్యటన ముగించుకుంది. ఇక డాలస్, శాన్ ఫ్లాన్సిస్కోల్లో రామ్ చరణ్ అండ్ కో హల్ చల్ చేయనుంది.

ఇక మగధీర తర్వాత యూఎస్ లో రామ్ చరణ్ కలెక్షన్స్ అంతగా సాధించింది లేదు. ఈ నేపథ్యంలో ధృవ హైయస్ట్ గ్రాసర్ గా నిలిచే అవకాశం ఉంది. దీంతోనైనా యూఎస్ లో రామ్ చరణ్ మూవీస్ పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వస్తాయో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Christmas Movies: క్రిస్మస్‌ కానుకగా విడుదలయ్యే సినిమాలివే.. కుర్రాళ్లతో శివాజీ ఫైట్‌.. ఒకే రోజు ఏడు సినిమాలు
అమ్మాయిల దుస్తులపై శివాజీ వల్గర్ కామెంట్స్...చిన్మయి, అనసూయ స్ట్రాంగ్ కౌంటర్