బుల్లితెరపై కన్నేసిన వెంకీ?

Published : Sep 11, 2017, 03:41 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
బుల్లితెరపై కన్నేసిన వెంకీ?

సారాంశం

టీవీ షో చేయడానికి సిద్ధపడుతున్న వెంకీ వెంకీతో షో చేయడానికి పోటీ పడుతున్న టీవీ ఛానెల్స్ ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ తో వస్తే చేయడానికి రెడీ  అన్న వెంకీ

ఒకప్పుడు.. బుల్లితెర అంటే చిన్న చూపు ఉండేది. సినీరంగానికి చెందిన వారెవరూ అటువైపు చూడటానికి కూడా పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు..కానీ ఇప్పుడలా కాదు... సిల్వర్ స్క్రీన్ మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో..  స్మాల్ స్క్రీన్ మీద కూడా అంతే చూపిస్తున్నారు. ఇప్పటికే.. నాగార్జున, చిరంజీవి, ఎన్టీఆర్, రానాలు.. బుల్లితెరపై విశ్వరూపం చూపించేశారు. ఇప్పుడు మరో హీరో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయనే విక్టరీ వెంకటేష్.

 

మూస పద్ధతిలో కాకుండా.. సినిమా, సినిమాకీ వేరియేషన్ చూపిస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకునే నటుల్లో వెంకటేష్ ఒకరు. స్టార్ డమ్ ని పక్కన పెట్టి మరీ ఆయన సినిమాలను ఎంచుకుంటారు. అసలు విషయానికి వస్తే.. ఇప్పుడు ఆయన బుల్లితెర మీద సందడి చేయబోతున్నారు. ఆయనతో  షో చేయడానికి  బుల్లితెర  ఛానెల్స్ కూడా ఎగబడుతున్నాయట.

 

అయితే.. మంచి ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ తో ముందుకు వస్తేనే  షో చేయడానికి అంగీకరిస్తానని వెంకీ కండిషన్ పెట్టాడట. ఆయన షరుతు ప్రకారం మంచి ఎలిమెంట్ తో ఎవరైనా ఆయన ముందుకు వస్తే.. ఆయన బుల్లితెర ద్వారా మన ముందుకు వచ్చే సమయం ఎంతో దూరంలో లేదు.

 

ఇక సిల్వర్ స్క్రీన్ విషయానికి వస్తే..గురు తర్వాత వెంకీ.. కొత్తగా ఏ సినిమా అంగీకరించలేదు. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నారు. రానాతో మల్టీ స్టారర్ చేయాలనే ఆలోచనలో ఉన్నప్పటికీ.. దానికి కూడా మంచి కథ దొరకాలిగా అంటున్నారు వెంకటేష్.

 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్