
దర్శకధీరుడు రాజమౌళి.. పరాజయమన్నది లేకుండా విజయాల బాటలో దూసుకుపోతున్నాడు. ఆయన అంతలా విజయం సాధించడానికి ఆయన ఎంచుకునే కథలే కారణం. రాజమౌళికి అంత మంచి కథలను అందించిన వ్యక్తి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.
కథల పరంగా రాజమౌళికి విజయాలను తెచ్చిపెడుతున్న విజయేంద్ర ప్రసాద్.. దర్శకుడిగా తనను తాను మాత్రం నిరూపించుకోలేకపోతున్నాడు. మరోసారి తనను తాను నిరూపించుకోవడానికి ‘శ్రీ వల్లీ’ సినిమా ద్వారా మన ముందుకు వస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్.. రామ్ చరణ్ నటించిన మగధీర సినిమా గురించి ఓ విషయాన్ని తెలియజేశారు. సింహాద్రి సినిమా తర్వాత.. ఈ మగధీర కథను మొదట రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ లు చిరంజీవికి వినిపించారట. అందుకు ఆయన అంగీకారం కూడా తెలిపారట. కానీ కొన్ని అనివార్య కారణాల కారణంగా ముందుకు సాగలేదట. చివరికీ తిరిగి రామ్ చరణ్ ఆ సినిమా చేయాల్సి వచ్చిందని విజయేంద్ర ప్రాద్ తెలిపారు.
ఒక వ్యక్తి చనిపోయిన తరువాత ఆలోచనలను చదివె శక్తి ఒక వ్యక్తికి లభిస్తే దానివల్ల ప్రయోజనం ఏమిటి అన్న విషయం చుట్టూ ‘శ్రీ వల్లి’కథ తిరుగుతుందని ఆయన చెప్పారు. ఈమధ్య కాలంలో వెరైటీ సినిమాలను బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులు విజయేంద్ర ప్రసాద్ చేస్తున్న ఈ ప్రయోగాన్ని ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి..