ప్రభాస్ పిటిషన్.. విచారణ మళ్లీ వాయిదా!

Published : Dec 21, 2018, 12:26 PM IST
ప్రభాస్ పిటిషన్.. విచారణ మళ్లీ వాయిదా!

సారాంశం

ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్ ని రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్ ని రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రభాస్ హైకోర్టుని ఆశ్రయించారు.

తాను చట్టబద్ధంగా కొనుగోలు చేసిన స్థలం వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా అభికారులను నియంత్రించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. వాయిదా పడుతూ వస్తోన్న ఈ పిటిషన్ పై ఈరోజు ఉమ్మడి హైకోర్టులో విచారణ జరిగింది.

రెవెన్యూ శాఖ అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ప్రభాస్ ఇంటిని సీజ్ చేశారని చట్టపరంగా వారు ప్రవర్తించలేదని ప్రభాస్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.

దీనిపై స్పందించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం వరకు ఎలాంటి కూల్చివేతలు చేయొద్దని హైకోర్టు తెలిపింది. 

ప్రభాస్ గెస్ట్‌హౌస్‌ సీజ్..నేడు హైకోర్టులో విచారణ

కోర్టు తీర్పు దెబ్బ: సినీ హీరో ప్రభాస్ ఇల్లు సీజ్

ఇల్లు సీజ్: హైకోర్టులో హీరో ప్రభాస్ పిటిషన్!

ప్రభాస్ ఇంటి వివాదం.. కోర్టు ఏమంటుందంటే..?

బలవంతంగా ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తున్నారు: ప్రభాస్

వాదనలు రేపు వింటాం.. ప్రభాస్ పిటిషన్ పై హైకోర్టు!

PREV
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు