ప్రభాస్ ఇంటి వివాదం.. కోర్టు ఏమంటుందంటే..?

Published : Dec 19, 2018, 04:16 PM IST
ప్రభాస్ ఇంటి వివాదం.. కోర్టు ఏమంటుందంటే..?

సారాంశం

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హైకోర్టుని ఆశ్రయించారు. తన గెస్ట్ హౌస్ విషయమై ఆయన కోర్టు మెట్లెక్కినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వస్తే.. శేరిలింగంపల్లిలో ప్రభాస్ గెస్ట్ హౌస్ ని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. 

ప్రభుత్వ స్థానంలో గెస్ట్ హౌస్ ఉందంటూ నోటీసులు అంటించారు. ఈ వివాదంపై నేడు హైకోర్టుని ఆశ్రయించారు ప్రభాస్. ఆయన పిటిషన్ ని స్వీకరించిన హైకోర్టు విచారణ జరిపింది. సీఎస్/7 లో భూమి ఉందా లేదా అని పిటిషనర్ ను హైకోర్టు ప్రశ్నించింది.

తాము కొనుగోలు చేసింది పాన్ ముక్తా స్థలమేనని పిటిషనర్ కోర్టుకి తెలిపారు. రేపు డివిజన్ బెంచ్ లో మరోసారి వాదనలు జరగనున్నాయి. తదుపరి విచారణని రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.

సర్వే నెంబర్ 46లో ఉన్న 84 ఎకరాల ప్రభుత్వ భూమిలో ప్రభాస్ గెస్ట్ హౌస్ ఉండటంతో ఈ వివాదం మొదలైంది. ఈ ఇంటిని ప్రభాస్ మరొక వ్యక్తి నుండి కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని విలువ దాదాపు వంద కోట్లు ఉంటుందని అంటున్నారు. 

కోర్టు తీర్పు దెబ్బ: సినీ హీరో ప్రభాస్ ఇల్లు సీజ్

ఇల్లు సీజ్: హైకోర్టులో హీరో ప్రభాస్ పిటిషన్!

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు