బాలయ్య కోసం రేసులో ముగ్గురు దర్శకులు!

Published : Dec 19, 2018, 03:54 PM IST
బాలయ్య కోసం రేసులో ముగ్గురు దర్శకులు!

సారాంశం

నందమూరి బాలకృష్ణ 'ఎన్టీఆర్' బయోపిక్ ని పూర్తి చేసే పనిలో పడ్డాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెలాఖరుకి సినిమా షూటింగ్ మొత్తం పూర్తికానుంది. 

నందమూరి బాలకృష్ణ 'ఎన్టీఆర్' బయోపిక్ ని పూర్తి చేసే పనిలో పడ్డాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెలాఖరుకి సినిమా షూటింగ్ మొత్తం పూర్తికానుంది. ఈ సినిమా తరువాత బాలయ్య కొద్దిరోజులు సినిమాల నుండి బ్రేక్ తీసుకోనున్నాడు.

వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సినిమాలకు గ్యాప్ ఇవ్వనున్నాడు. ఎన్నికల ఫీవర్ తగ్గిన తరువాత మళ్లీ సినిమాలు మొదలుపెట్టనున్నాడు. అయితే బాలయ్య కోసం ముగ్గురు దర్శకులు రేసులో ఉన్నారు. ముందుగా బోయపాటి.. బాలయ్యతో సినిమా చేయాలనుకుంటున్నాడు.

చరణ్ తో చేస్తోన్న 'వినయ విధేయ రామ' పూర్తైన వెంటనే బాలయ్యని కలవనున్నాడు. ఇప్పటివరకు వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఘన విజయాలు అందుకున్నాయి. ఈసారి బాలయ్య కోసం పొలిటికల్ థ్రిల్లర్ కథను రూపొందించనున్నాడు బోయపాటి. బోయపాటి పాటు లైన్ లో వివి వినాయక్ కూడా ఉన్నాడు. ఇప్పటికే పలు సార్లు వినాయక్ కథలను రిజెక్ట్ చేశాడు బాలయ్య.

ఫైనల్ గా ఓ కథను సిద్ధం చేసుకొని బాలయ్యని ఒప్పించే పనిలో పడ్డాడు వినాయక్. వచ్చే ఏడాది ఆరంభంలో తన కథతో బాలయ్యని కలవనున్నాడు ఈ దర్శకుడు. మరో యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి.. బాలయ్యతో సినిమా చేయాలనుకుంటున్నాడు. ప్రస్తుతం అనీల్ రావిపూడి రూపొందిస్తోన్న 'ఎఫ్2' సినిమా పండక్కి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది.

ఈ సినిమా విడుదలైన తరువాత ఈ కుర్ర దర్శకుడు బాలయ్యని కలిసి కథ వినిపించబోతున్నాడు. ఇప్పటికే బాలయ్య దగ్గర నుండి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు. కథ కూడా నచ్చితే  త్వరలోనే ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ ముగ్గురి దర్శకుల్లో బాలయ్య ముందుగా ఎవరితో సినిమా చేస్తాడో  చూడాలి!
 

PREV
click me!

Recommended Stories

Thanuja: ఇదీ తనూజ అసలు స్వరూపం, విన్నర్ అయ్యే ఛాన్స్ గోవిందా.. ఆమెకి ఎలివేషన్స్ ఇచ్చి వేస్ట్
Raktha Sambandham Review : ఎన్టీఆర్, సావిత్రి.. అన్నా చెల్లెలుగా నటించే సాహసం ఎలా చేశారు? ఆడియన్స్ ను ఏడిపించిన మహానటి