వాదనలు రేపు వింటాం.. ప్రభాస్ పిటిషన్ పై హైకోర్టు!

By Udayavani DhuliFirst Published Dec 20, 2018, 11:43 AM IST
Highlights

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్ ని రెవెన్యూ శాఖ అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ స్థలంలో ప్రభాస్ గెస్ట్ హౌస్ ఉందని సీజ్ చేయడంతో ప్రభాస్ బుధవారం నాడు హై కోర్టుని ఆశ్రయించారు. 

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్ ని రెవెన్యూ శాఖ అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ స్థలంలో ప్రభాస్ గెస్ట్ హౌస్ ఉందని సీజ్ చేయడంతో ప్రభాస్ బుధవారం నాడు హై కోర్టుని ఆశ్రయించారు.

పిటిషన్ ని స్వీకరించిన హైకోర్టు విచారణ జరుపుతూ సీఎస్/7 లో భూమి ఉందా లేదా అని ప్రశ్నించి విచారణను గురువారానికి వాయిదా వేసింది. తనకు నోటీసులు ఇవ్వకుండా ఇంటిని సీజ్ చేశారని ప్రభాస్ అంటున్నారు.

ఈరోజు కోర్టులో కేసు విషయాన్ని ప్రభాస్ లాయర్ ప్రస్తావించగా.. వాదనలు రేపు వింటామని కోర్టు స్పష్టం చేసింది. ఈ భూవివాదంపై రేపు హైకోర్టు బెంచ్ విచారణ జరపనుంది. సర్వే నెంబర్ 46లో ఉన్న 84 ఎకరాల ప్రభుత్వ భూమిలో ప్రభాస్ గెస్ట్ హౌస్ ఉండటంతో ఈ వివాదం మొదలైంది.

ఈ స్థలాన్ని2005లో బి.వైష్ణవీరెడ్డి, ఉషా, బొమ్మిరెడ్డి శశాంక్‌రెడ్డిల నుండి చట్టబద్ధంగా కొనుగోలు చేశాడు ప్రభాస్. దీని విలువ వంద కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. 

బలవంతంగా ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తున్నారు: ప్రభాస్

ప్రభాస్ ఇంటి వివాదం.. కోర్టు ఏమంటుందంటే..?

కోర్టు తీర్పు దెబ్బ: సినీ హీరో ప్రభాస్ ఇల్లు సీజ్

ఇల్లు సీజ్: హైకోర్టులో హీరో ప్రభాస్ పిటిషన్!

 

 

click me!