బలవంతంగా ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తున్నారు: ప్రభాస్

By Udayavani DhuliFirst Published Dec 20, 2018, 11:17 AM IST
Highlights

శేరిలింగంపల్లిలో ప్రభాస్ గెస్ట్ హౌస్ ని అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కావాలనే తనను బలవంతంగా ఖాళీ చేయించడానికి ప్రయత్నిస్తున్నారని రెవెన్యూ అధికారులను నియంత్రించాలని ప్రభాస్ హైకోర్టుని ఆశ్రయించారు. 

శేరిలింగంపల్లిలో ప్రభాస్ గెస్ట్ హౌస్ ని అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కావాలనే తనను బలవంతంగా ఖాళీ చేయించడానికి ప్రయత్నిస్తున్నారని రెవెన్యూ అధికారులను నియంత్రించాలని ప్రభాస్ హైకోర్టుని ఆశ్రయించారు.

అసలు విషయంలోకి వస్తే 2005లో శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం వద్ద సర్వే నెంబర్ 5/3 లో ఉన్న స్థలాన్ని చట్టబద్ధంగా కొనుగోలు చేశాడు ప్రభాస్. ఈ భూమిపై ఎలాంటి వివాదాలను లేవని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఆస్తి పన్ను, కరెంట్ బిల్ సమయానికి చెల్లిస్తున్నట్లు తెలిపారు.

ఈ భూమిలో తాత్కాలిక నిర్మాణాలు జరుగుతున్నాయని ముందు జాగ్రత్తగా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకొని రూ.1.05 కోట్లు ఫీజు కూడా చెల్లించామని, ఆ దరఖాస్తు ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. సడెన్ గా రెవెన్యూ అధికారులు వచ్చి తన భూమిని ప్రభుత్వ భూమిగా చెబుతూ తనను ఖాళీ చేయాలని చెప్పినట్లు పిటిషన్ లో పేర్కొన్నారు.

దానికి సుప్రీం కోర్టు తీర్పుని ఆధారంగా చూపారని అన్నారు. అసలు ఈ తీర్పు గురించి తనకు తెలియదని అన్నారు. దీనికి సంబంధించి తనకు నోటీసులు ఇవ్వలేదని, అధికారులు సహజ న్యాయ సూత్రాలను అనుసరించలేదని తెలిపారు. అధికారుల చర్యలు తన హక్కులను హరించే విధంగా ఉన్నాయని వారిని నియంత్రించాలని కోరారు.

అయితే ఈ మొత్తం వివాదం సివిల్ సూట్ 7,14 లకు సంబంధించిందని, దీనిపై మరో ధర్మాసనం విచారణ జరుపుతోందనే విషయం గ్రహించిన న్యాయమూర్తి ప్రభాస్ పిటిషన్ ని ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

ప్రభాస్ ఇంటి వివాదం.. కోర్టు ఏమంటుందంటే..?

కోర్టు తీర్పు దెబ్బ: సినీ హీరో ప్రభాస్ ఇల్లు సీజ్

ఇల్లు సీజ్: హైకోర్టులో హీరో ప్రభాస్ పిటిషన్!

click me!