
బిగ్‌బాస్ రియాలిటీ షోకి ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తుంది. ఇండియాలోనూ ఇది విజయవంతంగా రన్ అవుతుంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఈ షో రన్ అవుతుంది. ఇటీవల తెలుగులో ఐదో సీజన్‌ని పూర్తి చేసుకుంది. త్వరలోనే ఓటీటీలో ఆరో సీజన్ ప్రారంభం కాబోతుంది. మరోవైపు తమిళంలో ప్రస్తుతం ఐదో సీజన్ రన్ అవుతుంది. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హోస్ట్ గా ఈ రియాలిటీ షో రన్ అవుతుంది. షో మునింపు దశకు చేరుకుంటుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ షోపై తమిళ హీరోయిన్, బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్ సనమ్ శెట్టి షాకింగ్ కామెంట్ చేశారు. ఈ షో వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపింది. `బిగ్‌బాస్` షో ఎంతో మందిని ఆడియెన్స్ కి పరిచయం చేస్తుంది. సెలబ్రిటీలను తీసుకొస్తుంది. భారీ అభిమానగనాన్ని తెచ్చిపెడుతుంది. కానీ వాటి వల్ల ప్రయోజనం లేదంటు సనమ్ శెట్టి. ఆమె తాజాగా బిగ్‌బాస్ షోపై స్పందించింది. `బిగ్‌బాస్ షోలో పాల్గొనడం వల్ల తనకు సినిమా అవకాశాలు ఏం పెరగలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. షో నుంచి బయటకు వచ్చాక తనకు వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపింది. ప్రస్తుతం బిగ్‌బాస్ షో రన్ అవుతున్న సమయంలో ఆమె ఇలాంటి కామెంట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో పాల్గొన్న సనమ్ శెట్టి తమిళంలో దాదాపు 25కిపైగా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపుని తెచ్చుకుంది.
ఇదిలా ఉంటే ఇటీవల తెలుగులో ఐదో సీజన్ పూర్తయ్యింది. వీజే సన్నీ ఐదో సీజన్ టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. యాభై లక్షల ప్రైజ్‌మనీ, ట్రోఫీని అందుకున్నారు. విశేష అభిమానగణాన్ని ఏర్పర్చుకున్నారు. ప్రస్తుతం సన్నీకి మంచి ఫాలోయింగ్ ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయని తెలిపారు సన్నీ. తానిప్పుడు కెరీర్ పరంగా బిజీ అవుతున్నట్టు చెప్పారు. బిగ్‌బాస్ 5లో ఇంకా ఎవరికీ అవకాశాలు దక్కలేదు. లోబోకి అవకాశాలు వచ్చాయి. ఆయన చిరంజీవి `భోళాశంకర్`లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు వెల్లడించారు.
యాంకర్‌గా ఫుల్ స్వింగ్‌లో ఉన్న యాంకర్ రవి బిగ్‌బాస్ 5లోకి వచ్చి వెళ్లాక ఆయన్నుంచి ఎలాంటి గుడ్ న్యూస్ లేదు. షోలు కూడా లేవు. మున్ముందు పరిస్థితేంటో చూడాలి. మరోవైపు ఆర్జే కాజల్ కూడా సైలెంట్ అయిపోయారు. ఇదే కాదు గత సీజన్ లోనూ భారీ గుర్తింపుని, క్రేజ్‌ని తెచ్చుకున్న వారు కూడా ఎలాంటి సినిమా అవకాశాలు దక్కించుకోలేకపోవడం గమనార్హం. నాల్గో సీజన్ విన్నర్ అభిజిత్ ఇప్పటి వరకు ఆయన్నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదు. కానీ అందరి హృదయాలను గెలుచుకున్న సోహైల్ రెండు సినిమాలను ప్రకటించడం విశేషం.
బిగ్‌బాస్ సీజన్ పేరుని, గుర్తింపుని తీసుకొస్తుందిగానీ, అవకాశాలు తీసుకురాలేకపోతుందనే విమర్శలు ప్రారంభం నుంచి వినిపిస్తుంది. మరికొందరికి నెగటివ్‌గా మారుతుందనే కామెంట్లు వస్తున్నాయి. ఐదో సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన షణ్ముఖ్.. కెరీర్ ట్రాక్ తప్పింది. బిగ్‌బాస్ హౌజ్‌లో సిరితో ఫ్రెండ్‌షిప్, అతని ప్రవర్తన ఆడియెన్స్ లోకి నెగటివ్‌గా వెళ్లింది. దీంతో ఏకంగా ఆయన ప్రియురాలు దీప్తి సునైనా బ్రేకప్ చెప్పింది. ఇద్దరం కలిసి ట్రావెల్ చేయలేమని వెల్లడించింది. దీంతో షాక్‌లోకి వెళ్లిపోయాడు షణ్ముఖ్. మరోవైపు గత సీజన్‌లో గత సీజన్‌లో అఖిల్, మోనాల్ మధ్య లవ్ ట్రాక్ బాగా సక్సెస్ అయ్యింది. ఇప్పటికీ వారిద్దరి మధ్య మంచి రిలేషన్ కంటిన్యూ అవుతుండటం విశేషం.
also read: అఫీషియల్.. షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పిన దీప్తి సునైనా.. మంట పెట్టింది ఎవరు