తలపై కొట్టి మొబైల్ లాక్కెళ్లారు.. నడిరోడ్డుపై హీరోయిన్ కి భయంకర అనుభవం!

Published : Dec 01, 2021, 08:40 AM IST
తలపై కొట్టి మొబైల్ లాక్కెళ్లారు.. నడిరోడ్డుపై హీరోయిన్ కి భయంకర అనుభవం!

సారాంశం

బాలీవుడ్ హీరోయిన్ నిఖిత దత్త మొబైల్ దొంగిలించబడింది. మొబైల్ స్నాచర్స్ ఆమె ఫోన్ చేతి నుండి లాక్కొని పారిపోయారు. ఈ విషయాన్ని నిఖిత దత్త సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.  ఇటీవల హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో జరిగిన సంఘటన సంచలనం రేపింది. 

నటి షాలు చౌరాసియాపై ఓ దుండగుడు దాడి చేసి ఆమె ఆపిల్ మొబైల్ తీసుకొని పారిపోయాడు. ఈ దాడిలో చౌరాసియా గాయాలపాలు కావడంతో పాటు షాక్ కి గురయ్యారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుడ్ని కనిపెట్టి అరెస్ట్ చేశారు. ముంబైలో నటి నిఖిత దత్తకు ఇదే తరహా సంఘటన ఎదురైంది. 
ఆదివారం ఆమె ముంబై బాంద్రా సమీపంలో రోడ్డుపై నడిచివెళుతుండగా షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. 

నిఖిత దత్త(Nikita dutta)  తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఈ విధంగా సంఘటన గురించి వివరించారు. బాంద్రా రోడ్ నంబర్ 14లో రాత్రి 7:45 గంటల సమయంలో ఒంటరిగా రోడ్డుపై నడిచివెళుతున్నాను. ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి నా తల వెనుకభాగంలో చిన్నగా కొట్టారు. దానితో నేను సడన్ షాక్ కి గురయ్యారు. వెంటనే బైక్ వెనుక కూర్చొన్న వ్యక్తి నా మొబైల్ చేతిలో నుండి లాక్కున్నాడు. అప్పుడు బైక్ కదలికలోనే ఉంది. 


రెండు మూడు సెకండ్స్ ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. వెంటనే కోలుకొని బైక్ ని వెంబడించాను. నా అరుపులకు అక్కడ ఉన్నవారు స్పందించారు. ఆ దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే వాళ్లిద్దరూ వేగంగా బైక్ నడుపుకుంటూ దొరక్కుండా పారిపోయారు. స్థానికులు నాకు మద్దతుగా నిలిచారు. వాటర్ ఇచ్చి, నాకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. బాంద్రా పోలీస్ స్టేషన్ లో నేను కంప్లైంట్ ఇచ్చాను... అని ఆమె వివరించారు.

 Also read రాజ్ తరుణ్ కాలో చెయ్యో విరగాలనుకున్నా.. అరియనా సంచలన వ్యాఖ్యలు
ఇక నిఖిత దత్త సంఘటన  గురించి తెలుకున్న మిత్రులు, సినిమా ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలిచారు. జాగ్రత్త, ధైర్యంగా ఉండు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కంప్లైంట్ ఆధారంగా పోలీసులు నేరస్థులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.  

Also read మైండ్ బ్లోయింగ్ హాట్.. డిజైనర్ శారీలో రెచ్చిపోయిన 'అఖండ' బ్యూటీ

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today డిసెంబర్ 11 ఎపిసోడ్ : మీనాని ఏడిపించేసిన అత్త, ప్రభావతి కి లెఫ్ట్ రైట్ వాయించిన శ్రుతి
2025 Flop Heroines: 2025లో ఫ్లాప్ సినిమాలతో పోటీ పడ్డ హీరోయిన్లు.. వాళ్ళిద్దరికీ మూడేసి డిజాస్టర్లు